మరోసారి రామ్ చరణ్ తో జతకట్టనున్న బాలీవుడ్ భామ?

మెగాస్టార్ చిరంజీవి నట వారసునిగా రామ్ చరణ్ తేజ్ పలు విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ, వరుస అవకాశాలతో తెలుగు ఇండస్ట్రీలో అగ్రహీరోగా కొనసాగుతున్నాయి. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా ఓ పాన్‌ ఇండియా మూవీని సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే.

హీరో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా మూవీలో రామ్ చరణ్ సరసన నటించడానికి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను దర్శకుడు శంకర్ సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై ఆమె స్పష్టత ఇవ్వాల్సి ఉందట. ప్రస్తుతం అలియా తెలుగులో “ఆర్‌ఆర్‌ఆర్‌” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఓకే అయితే
అలియాకు చరణ్‌తో ఇది రెండవ సినిమా అవుతుంది.

Also read:అను ఇమాన్యుల్ కు నెటిజెన్ వింత ప్రపోజల్..?

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న. “ఆర్ఆర్ఆర్‌” లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య “మూవీలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Also read:అతను ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేసుకుంటా.. అవికా గోర్!