మంచు లక్ష్మి మెగాస్టార్ చిరుతో స్టెపులు వెయడం ఏంటి అనుకుంటున్నారా? ఈ స్టెపులు ఎదో సినిమా కోసం కాదులేండి అసలు విషయం వేరే ఉంది. వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ 150 సినిమా కోసం ఎందరో అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటివలే రిలీజ్ చేసిన ఖైది నెం150 ఫస్ట్ లుక్ కి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
అయితే మంచు ఫ్యామిలికి, మెగా ఫ్యామిలి కి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు వచ్చినట్టు అనిపిస్తాయి .. కానీ ఆ రెండు కుటుంబాల వ్యక్తులు మాత్రం ఏ ఫంక్షన్లో కలిసిన సరదాగా మాట్లాడుకుంటారు. ఇక మంచు ఫ్యామిలీలో మంచు లక్ష్మి చాలా సరదాగా ఉంటుంది. అందరితో ఇట్టే కలిసిపోయే మనస్థత్వం. మెగాస్టార్ పుట్టిన రోజు పంక్షన్లో చిరుతో మంచు లక్ష్మి స్టెప్పెసి షాక్ ఇచ్చింది.
ఈ మద్యే మెగాస్టార్ తన పుట్టిన రోజు ను గ్రాండ్ గా పలువురు ప్రముఖులు, ఆత్మీయుల మధ్య జరుపుకున్నాడు. ఈ పంక్షన్ లో పాల్గొన్న అందరూ చాలా సరదాగా చిరుతో చెందేశారు ? ఆ లిస్ట్ లో మంచు లక్ష్మి కూడా ఉంది ? మెగాస్టార్ తో డాన్స్ వేయాడానికి ఎవరైనా ఇష్టపడుతారు. అటువంటి ఆయనతో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ వస్తే .. ఎవరు మిస్ చేసుకుంటారు. అందుకే మంచు లక్ష్మి కూడా మెగాస్టార్ తో సరదాగా చిందేసింది.
Related