మంచు మనోజ్.. షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్ ఎల్.టి.టి.ఇ గ్రూపు కథ నేపథ్యంలో ”ఒక్కడు మిగిలాడు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత మరో మూవీ కూడా లైన్లో ఉంది. ఈ క్రమంలో మంచు మనోజ్.. ఈ రోజు ఒక ట్వీటుతో అందరికీ షాకిచ్చాడు.
{loadmodule mod_custom,GA1}
”ఒక్కడు మిగిలాడు.. తర్వాత మరో మూవీ.. ఇవే నా ఆఖరి సినిమాలు. యాక్టింగ్ కు స్వస్తి పలుకుతున్నాను. థ్యాంక్యూ” అంటూ ట్వీటేశాడు. సరదాగా జోక్ చేశాడా..? లేదంటే.. నిజంగా యాక్టింగ్ కెరియర్ వదిలేస్తున్నాడా..? అయితే.. ఇప్పటి వరకు మనోజ్ చాలా సినిమాలు చేసిన.. ఆ సినిమాలు మనోజ్ కి పెద్దగా ఉపయోగపడలేదు. దాంతో మనోజ్ కి స్టార్ హీరో క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. కానీ యాక్టర్ పరంగా మంచి మార్కులు అయితే కొట్టేశాడు. 2004లో దొంగా దొంగది సినిమాతో హీరో అయిన మనోజ్.. ఆ తరువాత నేను మీకు తెలుసా.. బిందాస్.. వేదం.. ప్రయాణం.. పోటుగాడు.. కరెంట్ తీగ వంటి సినిమాలతో వచ్చాడు. 34 ఏళ్ల మంచు మనోజ్ కు 2015లో ప్రణతి రెడ్డితో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.
{loadmodule mod_custom,GA2}
అయితే యాక్టింగ్ కు స్వస్తి పలికేసి డైరక్షన్ పగ్గాలు చేపడతాడని.. అలానే మంచు లక్ష్మీ ప్రసన్న ఎంటర్టయిన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలు తీస్తాడని ఒక టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా కూడా మనోజ్ ఇటువంటి షాకింగ్ డెసిషన్ ను ట్విట్టర్ ద్వారా చెప్పడం ఎవ్వరికీ మింగుడుపడలేదు. యాక్టింగ్ కెరియర్ వదిలేసేంత పెద్ద వయస్సు అతని కాదు.. అలాగే ఇప్పుడు అవకాశాలూ లేకుండా పోలేదు. మరి మోహన్ బాబు మనోడిని కన్విన్స్ చేసి ఈ ప్లాన్ డ్రాప్ చేయిస్తారేమో అని ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు.
{youtube}GTOu-fJ5ZBg{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related