Sunday, April 28, 2024
- Advertisement -

చిరు ఆశాలన్నీ ” వాల్తేరు వీరయ్య ” పైనే !

- Advertisement -

గాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ” వాల్తేరు వీరయ్య “. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. వింటేజ్ చిరును గుర్తుకు తెస్తు.. పక్కా మాస్ మసాలా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మెగా స్టార్ చిరంజీవి వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది సమ్మర్ లో ఆచార్య తో రాగా, దసరా కానుకగా గాడ్ ఫాదర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు చిత్రాల్లో ” ఆచార్య ” డిజాస్టర్ కాగా, ” గాడ్ ఫాదర్ ” పరవలేదనిపించింది.అయితే గాడ్ ఫాదర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికి చిరు రేంజ్ హిట్ కాదనే వాదన ఇండస్ట్రీలో నడుస్తోంది. .

దాంతో చిరు రీఎంట్రీ మూవీ ” ఖైదీ నెంబర్ 150 ” బ్లాక్ బస్టర్ గా నిలిచిన తరువాత ఆ రేంజ్ విజయం దక్కలేదనే చెప్పాలి. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన ” సైరా ” కూడా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం కోసం చిరు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. ఇక బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ” వాల్తేరు వీరయ్య ” మూవీ నుంచి దీపావళి కానుకగా టైటిల్ టిజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. టిజర్ లో మెగాస్టార్ ఊర మాస్ లుక్ లో సరికొత్తగా కనిపిస్తుండడంతో.. ఈ సారి మెగాస్టార్ గట్టిగా హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీతోనైనా మెగాస్టార్ చిరంజీవి తన రేంజ్ కు తగిన హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రాంచరణ్ మూవీని.. విజయ్ తో తీస్తున్నాడా ?

మహేశ్ కు విలన్ గా కార్తీ.. రాజమౌళి అదిరిపోయే ప్లాన్ !

తప్పు తెలుసుకుంటున్న విజయ్.. ఇకపై వినయం ప్రదర్శిస్తాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -