Tuesday, May 7, 2024
- Advertisement -

రాంచరణ్ మూవీని.. విజయ్ తో తీస్తున్నాడా ?

- Advertisement -

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో రెండు విభిన్న పాత్రలలో చరణ్ నటిస్తున్నాడని సమాచారం. ఇక ప్రాజెక్ట్ తరువాత చరణ్ జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా చరణ్ కోసం ఒక ఫిల్ గుడ్ స్టోరీ సిద్దం చేశాడని ఆ కథ చరణ్ కు బాగా నచ్చిందని ఆ మద్య ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు బాగానే వినిపించాయి. శంకర్ డైరెక్షన్ లో చేయబోయే మూవీ పూర్తి అయిన తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతం రాంచరణ్ హోల్డ్ లో పెట్టినట్లు తాజా సమాచారం. దాంతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి వేరే హీరోతో మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో మూవీ చేసే ప్లాన్ లో ఉన్నాడట గౌతమ్. అయితే చరణ్ కు వినిపించిన కథతోనే విజయ్ ని అప్రోజ్ అయ్యడా లేదా వేరే కథతో రౌడీ మూవీ చేయనున్నాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ పై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ ” ఖుషీ ” అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత చెయ్యాల్సిన ” జనగణమన ” ప్రాజెక్ట్ లైగర్ డిజాస్టర్ కావడంతో ఆగిపోయింది. దీంతో ఖుషీ తరువాత విజయ్ ప్రాజెక్ట్ గౌతమ్ తోనే ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

వీరసింహారెడ్డి గా బాలయ్య..

బాస్ వస్తుండు.. గెట్ రెడీ !

బాలయ్య vs చిరు : బిగ్ ఫైట్ కు ససేమిరా అంటున్న బడా బ్యానర్…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -