Friday, May 17, 2024
- Advertisement -

మూడు రాజధానులపై ప్రజలకు ఆసక్తి లేదా ? జగన్ అనవసరంగా చిక్కుల్లో పడ్డారా ?

- Advertisement -

ఏపీలో వైఎస్ జగన్ అధికరంలోకి వచ్చిన తరువాత కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. వాటిలో మూడు రాజధానుల అంశం కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత అందరూ కలిసి అభివృద్ది చేసిన హైదరబాద్ తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో ఏపీకి సరైన రాజధాని లేక పోవడంతో గత చంద్రబాబు ప్రభుత్వం అన్నీ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రనికి మద్యన ఉన్న అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇక అమరావతి రాజధానిగా ఉండేందుకు కేంద్రంతో పాటు రాష్ట్రంలో అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్ కూడా అంగీకరించారు. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికరంలోకి వచ్చారు.

ఇక జగన్ అధికరంలోకి వచ్చిన తరువాత.. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో దేశంలో ఎక్కడ లేని విధంగా మూడు రాజధానుల ప్రస్తావనను తెరపైకి తెచ్చారు. కేవలం ప్రస్తావన వరకే పరిమితం కాకుండా జీవో జారీచేశారు కూడా. దీంతో జగన్ నిర్ణయం పట్ల ఇతర పార్టీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఇక అమరావతి రాజధాని కొరకు భూములిచ్చిన రైతులు హైకోర్టు లో పిటిషన్ వేశారు, దీంతో జగన్ సర్కార్ నిర్ణయానికి ఊహించని బ్రేకులు పడ్డాయి. అయినప్పటికి మూడు రాజధానుల విషయంలే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వైసీపీ ప్రభుత్వం గట్టిగానే చెబుతోంది. ముందుగా విశాఖా నుంచి పరిపాలన సాగిస్తూ మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకెల్లే ప్రణాళిక వేసింది జగన్ సర్కార్.

అందులో భాగంగానే ఉత్తరాంధ్ర ప్రజలను ఆకట్టుకునేందుకు.. విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు ప్రజా మద్దతు కోసం ఈ నెల 15న నాన్ పోలిటికల్ జె ఏసీ సహాయంతో విశాఖ గర్జనను ఏర్పాటు చేసింది. మంత్రులు, ఎమ్మేల్యేలు, మాజీ మంత్రులు,, ఇతర వైసీపీ నేతలు ఇలా అందరూ విశాఖ గర్జన ర్యాలీలో పాల్గొని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. గర్జనకు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నప్పటికి, వాస్తవానికి పరిస్థితి అలా లేదనేది అందరికీ తెలిసిన విషయమే. గర్జనకు ప్రజల నుంచి ఊహించినంత రెస్పాన్స్ రాకపోవడంతో మూడు రాజధానుల విషయంలో ప్రజల వైఖరి ఎలా ఉందో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇక ఇదే విషయంపై మంత్రి దర్మాన ప్రసాదరావు బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు.

విశాఖ రాజధాని కొరకు ఉత్తరాంధ్ర ప్రజలు నోరేందుకు విప్పడం లేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి జై కొట్టడానికి వచ్చిన ఇబ్బందేమిటి ? మా ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందనిపిస్తే చెప్పాలని, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని, దర్మాన చెప్పుకొచ్చారు. దర్మాన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. మూడు రాజధానుల విషయంలో ప్రజలు కూడా ఆసక్తిగా లేరనేది వైసీపీ నేతలకు కూడా తెలుసు. మరి మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జగన్ సర్కార్ కరాకండిగా చెబుతోంది. అయితే ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. మరి ఎన్నికలు వచ్చే లోగా.. మూడు రాజధానుల అంశాన్ని పూర్తి చేయకపోతే మాట తప్పిన వ్యక్తిగా జగన్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మూడు రాజధానులను సక్సస్ ఫుల్ గా ప్రతిపాధించిన ప్రజలు ఎంతవరకు సమర్థిస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. ఎటొచ్చీ ఈ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి జగన్ చిక్కుల్లో పడ్డారనే చేపోచ్చు.

ఇవి కూడా చదవండి

చంద్రబాబు చాణక్యం.. పవన్ కు కలిసొస్తుందా ?

తప్పు ఎవరిది.. చంద్రబాబుదా ఎన్టీఆర్ దా ?

జగన్ను ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -