ఆ దర్శకుడిపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు ?

Megastar Chiranjeevi Comments on Star Director
Megastar Chiranjeevi Comments on Star Director

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికి ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చిన్న సినిమాలను కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక తాజాగా ” ఫస్ట్ డే ఫస్ట్ షో ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గా వచ్చి చిత్రయూనిట్ లో మంచి జోష్ నింపారు. అయితే ఆయన ఈ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఇనడస్ట్రీ వర్గాల్లో కాస్త చర్చనీయాంశం అవుతున్నాయి. ” కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, దర్శకులు కథపై బాగా దృష్టి పెట్టాలని ” ఆయన చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా ” పెద్ద స్టార్ హీరోల కాల్షిట్లు దొరికాయని, కథపై ఎలాంటి కసరత్తు చేయకుండా ఏదో హడావిడిగా సినిమా తీయొద్దని ” చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరి గురించి చేశారు అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. చిరు చేసిన వ్యాఖ్యలు కొరటాల శివ గురించేనని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వ్నిపిస్తున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ ” ఆచార్య “. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మూవీలో కథ చాలా వీక్ గా ఉందని, అసలు కొరటాల మూవీ లాగా లేదని, నెటిజన్స్ కొరటాల శివ పై భారీగా విమర్శలు చేశారు. అయితే ” ఆచార్య ” మూవీ రిజల్ట్ చిరంజీవిని కూడా బాగా నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. దాంతో పరోక్షంగా కొరటాల శివను దృష్టిలో పెట్టుకొనే చిరు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: పుష్ప2 లో మెయిన్ విలన్ ” షెకావత్ ” కాదా ?