Friday, March 29, 2024
- Advertisement -

పవన్ను దూరం పెట్టి ఎన్టీఆర్ వైపు.. బీజేపీ చూపు.. అసలు వ్యూహం తెలిస్తే మైండ్ బ్లాకే !

- Advertisement -

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బీజేపీ అనుసరిస్తోన్న వ్యూహం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా జూ. ఎన్టీఆర్ తో భేటీ కావడంతో రాజకీయంగా ఎన్నో ప్రశ్నలు సందేహాలు తెరపైకి వచ్చాయి. అసలు అమిత్ షా ఎన్టీఆర్ తో ఎందుకు భేటీ అయ్యారు ? ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశానికి బీజేపీ రెడ్ కార్పెట్ వేస్తోందా ? ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్న పవన్ను కాదని బీజేపీ జూ. ఎన్టీఆర్ వైపు ఎందుకు చూస్తోంది ? బీజేపీ జనసేన మద్య దూరం పెరిగిందా ? అన్న ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమయ్యాయి. అయితే ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ పై బీజేపీ శ్రేణులు చాలా లైట్ సమాధానం ఇస్తున్నప్పటికి అంతర్గతంగా చాలా పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం బీజేపీ జనసేన పరోక్షంగా పొత్తులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ జనసేన కార్యాచరణలో బీజేపీతో కలిసి ప్రయాణించేందుకు సిద్దంగా లేరు. ఎందుకంటే ఈ మద్య పవన్ చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమం, వంటి కార్యాచరణలో ఎక్కడ కూడా బీజేపీ ఊసే లేదు. ఇక దసరా నుంచి చేపట్టబోయే బస్సు యాత్రలో కూడా బీజేపీ ప్రస్తావన లేదు. దీన్ని బట్టి చూస్తే పవన్ బీజేపీ తో కలిసి ప్రయాణించేందుకు విముఖత చూపిస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది. ఇక బీజేపీ కూడా పవన్ను లైట్ తీసుకొని ఏపీలో బలపడేందుకు మరో ప్రత్యామ్నాయంగా జూ. ఎన్టీఆర్ వైపు చూస్తోందని పలువురు విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఆ మద్య బీజేపీ పెద్దలు చిరంజీవితో కూడా సంప్రదింపులు జరిపినప్పటికి చిరు ఆసక్తి చూపించలేదనే వార్తలు వచ్చాయి. దీంతో మంచి వాక్చాతుర్యం కల్గిన ఎన్టీఆర్ ను రంగంలోకి దించి ఏపీలో ఎదిగేందుకు కమలనాథులు ప్రణాళికలు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ ఎన్టీఆర్ నే ఎంచుకోవడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఏపీలో బలమైన ప్రతిపక్ష పార్టీగా టిడిపి ఉంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోతే.. ఆ పార్టీ స్థితిగతులే మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు కచ్చితంగా ఆ పార్టీ శ్రేణులు జూ. ఎన్టీఆర్ వైపు చూసే అవకాశం ఉంది. అందువల్ల టీడీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎన్టీఆర్ ను ఇప్పటినుంచే దువ్వే ప్రయత్నం బీజేపీ చేస్తోందని కొందరి విశ్లేషకుల వాదన. ఒకవేళ ఎన్టీఆర్ బీజేపీతో చేతులు కలిపితే.. ఏపీలో టీడీపీ ప్లేస్ ను బీజేపీ ఆక్రమించే అవకాశం ఉంది. అందుకే పక్క ప్రణాళిక బద్దంగా జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: టీడీపీ ఎన్డీయేలో చేరితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -