Friday, April 26, 2024
- Advertisement -

ఏపీ తెలంగాణ మద్య ముదురుతున్న వివాదం

- Advertisement -

ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీ తెలంగాణ మద్య సన్నిహిత సంబందాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. మొదట్లో టి‌ఎస్ సి‌ఎం కే‌సి‌ఆర్ అలాగే ఏపీ సి‌ఎం వైఎస్ జగన్ ఒకరిపై ఒకరు పొగడ్తలు కురిపించుకుంటూ స్నేహభావంగా మెలుగుతూ వచ్చారు. కానీ రోజులు గడిచే కొద్ది ఈ స్నేహభావం మసకబారుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పరిపాలన విధానంపై తెలంగాణ మంత్రులు కౌంటర్లు వేయడం అలాగే టి‌ఆర్‌ఎస్ నేతలపై వైసీపీ శ్రేణులు ఘాటు వ్యాఖ్యలు చేయడం ఈ మద్య తరచూ జరుగుతూ వస్తోంది. ఇక నీటి వాటాల విషయంలోనూ, అభివృద్ది విషయంలోనూ ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం చూస్తుంటే.. వైసీపీ టి‌ఆర్‌ఎస్ మద్య దూరం పెరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమౌతుంది..

ఇక తాజాగా విద్యుత్ బకాయిల విషయంలో కేంద్రం ఇచ్చిన నివేదికతో మరొకసారి ఇరు రాష్ట్రాల మద్య వివాదం రాజుకుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 నిబంధనల మేరకు కేంద్రం ఆదేశాలతో ఏపీ జెన్కొ తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసిందని, ఆ విధంగా సరఫరా చేసిన విద్యుత్ విలువ 3,441.78 కోట్లుగా ఉండని, కానీ తెలంగాణ ఆ మొత్తాన్ని ఇప్పటివరకు ఏపీకి చెల్లించలేదని కేంద్రం తెలిపింది. ఇక విద్యుత్ సర్ ఛార్జీలు కూడా 3,315.14 కోట్లు ఉందని, విద్యుత్ బకాయిలు మరియు సర్ ఛార్జీలు మొత్తం కలిపి 6,756.92 కోట్లు ఏపీకి తెలంగాణ చెల్లించాలని కేంద్రం తెలిపింది. విభజన చట్టంలో ఉన్న సెక్షన్ 92 ప్రకారం తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించే హక్కు ఉండని కేంద్రం చెప్పుకొచ్చింది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లో ఏపీకి చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.

అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం రివర్స్ లో రియాక్ట్ అవుతోంది. అసలు ఏపీకి చెల్లించడం కాదు.. ఏపీనే తెలంగాణకు బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలగాణ ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఇరు రాష్ట్రాల మద్య ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇక తాజాగా తెలంగాణ తీరుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు కాస్త ఘాటుగా స్పందించారు. విద్యుత్ బకాయిల విషయంలో కేంద్రం చెప్పిందే ఫైనల్ అని, తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా తప్పించుకోవాలని చూస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అంబటి హెచ్చరించారు. దీంతో విద్యుత్ బకాయిల విషయంలో ఇరు రాష్ట్రాల మద్య ఏర్పడిన వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Also Read

దేశానికి అయిదు రాజధానులు.. కేంద్రం ఆలోచిస్తుందా ?

టీడీపీ ఎన్డీయేలో చేరితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

కాంగ్రెస్ పార్టీ రాహుల్ వల్లే సర్వనాశనం అవుతోందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -