Friday, May 10, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కే నో చెప్పిన హీరోయిన్!

- Advertisement -
heroine take light pawan

టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ రెంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అలాగే పవన్ అభిమానించే అభిమానులు నటి నటులు కూడా చాలానే ఉన్నారు. పవన్ తో సినిమా చేయడానికి హీరోయిన్లు, క్యార‌క్ట‌ర్ ఆర్టిస్టులు సైతం చాలా ఆస‌క్తి చూపిస్తుంటారు. పవన్ ఛాన్స్ ఇస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతులేయడం ఖాయం. అటువంటి పవన్ ఆఫర్‌ను చాలా కేర్ లెస్ గా కోలీవుడ్ భామ నయనతార కాదనేసిందట.

కోలీవుడ్ లో నయన్ సినిమాలో ఉంటే అది సూపర్ హిట్ అనే సెంటిమెంట్ బలంగా ముద్ర పడింది. ఆమెకు అక్కడ సూపర్ క్రేజ్ ఉంది. కోలీవుడ్‌లో న‌య‌న ఎంత బిజీగా ఉన్నా సరే తెలుగులో విక్టరీ వెంకటేష్ తో బాబు బంగారం సినిమా ఒప్పుకుంది. ఆ సినిమాకు కూడా ఆమె చిత్ర యూనిట్‌ను ర‌క‌ర‌కాలుగా ఇబ్బందులు పెట్టి కానీ షూటింగ్ పూర్తి చేయ‌లేదు. ఇక నీస‌న్ డైరెక్ష‌న్‌లో ఏఎం.ర‌త్నం నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ కోసం న‌య‌న‌తార‌ను సంప్ర‌దించార‌ట‌.

ఈ సినిమాకు న‌య‌న‌తార డేట్స్ ఖాళీలేవు అన్నది కారణం చూపి చేయ‌న‌ని చెప్పేసింద‌ట‌.  దాంతో పవన్ పిలిచి ఆఫర్ ఇస్తా అని చెప్పిన న‌య‌న‌తార‌ నో అని చెప్పి పవన్ ను అవమానించిందట. ఆమెకు అస‌లు తెలుగులో న‌టించాల‌నే లేద‌న్న‌ది ఆమె ఉద్దేశ్య‌మ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే పవన్ సినిమానే కాదు.. టాలీవుడ్‌ లో సినిమాలే చేయను అని టాలీవుడ్‌ను చిన్న చూపు చూస్తోంద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

Related

  1. పవన్‌ జీవన విధానం చూస్తే షాక్‌ కావాల్సిందే!
  2. డైరెక్టర్ ను తిట్టి సెట్స్ నుంచి వెళ్లిపోయిన పవన్! ఏం జరిగింది?
  3. నయనతార కొత్త వ్యవహారం!
  4. సమంత ఫ్యాన్స్ కు మహేష్ కుమార్తె సర్ ప్రైజ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -