Sunday, April 28, 2024
- Advertisement -

ప్రభుత్వ సొమ్ము దోచేస్తున్నారు…

- Advertisement -

అక్కడ చట్టాలు పేరుకే.. రాజ్యంగహక్కులు ఎన్నిఉన్నా, తరాలు మారినా వారి తలరాత మారవు. షెడ్యూల్ ఏరియాలో మైనింగ్ చేయాలన్నా, ఇసుక క్వారీలకు అనుమతులు కావాలన్నా పెసాచట్టం ప్రకారం అనుమతులు ఆదివాసీలకే దక్కాలీ. అనుమతులు ఆదివాసీల పేరుతోనే కానీ పెత్తనం అంతా రాజకీయ నేతలదే. అధికారమే పెట్టుబడిగా ఎమ్మేల్యేలే వ్యాపారంగా సాగిస్తూ, యజమానులనే కూలీలుగా మార్చి, పెసాచట్టాన్నిపాతరేసి, ఇసుక క్వారీల్లో కోట్లు దండుకుంటున్న శాండ్ మాఫియాకు భద్రాద్రి ఏజెన్సీ అడ్డాగా మారింది.

ఇసుక క్వారీలు.. ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మేల్యేలైనా, కొందరు మంత్రులైనా ఎవ్వరైనా రాజకీయాల్లో ఉనికి కోసం ఈజీమనీ కోసం ఉన్న ఆదాయ మార్గాలు శాండ్.. వైన్.. మైన్. ఇవే రాజకీయాలను శాసిస్తున్నాయి. దాంతో ఏపార్టీ అధికారంలో ఉన్నా ఆపార్టీ నేతల కన్నుఇసుక క్వారీలపైనే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక రీచ్‎ల వ్యాపారం. గోదావరి పరివాహాక ప్రాంతం కావడంతో పాటు ఉపనదులైన కిన్నెరసాని ఇసుక రీచ్‎లకు పెట్టింది పేరు. కానీ భద్రాద్రి జిల్లా షెడ్యూల్ ఏరియాలో ఉండటంతో ఇసుక క్వారీలైనా, మైనింగ్ కార్యకలపాలకు అనుమతులు కావాలన్నాపెసా చట్టం ప్రకారం అనుమతులు మంజూరు కావాలి.

పెసాచట్టం అంటే పంచాయతీ ఎక్ సెన్షన్ షెడ్యూల్డ్ ఏరియా అనే చట్టాన్నికేంద్రప్రభుత్వం 1996 లో రూపొందించగా ఆచట్టాన్ని, ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అమల్లోకి తెచ్చారు. 2011లో జీవో నెంబర్ 66ను పంచాయతీ రాజ్ శాఖ మార్గ దర్శకాలను రూపొందించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత గనుల శాఖ జీవో నెంబర్ 3, మరియి 38 జీవోల ద్వారా గైడ్ లైన్లు ఇస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక రీచ్ల కేటాయింపు పెసా చట్టానికి లోబడి ఉండాలని మార్గదర్శకాలు ఉన్నాయి. పెసా చట్టంలో ఏడవ నిబంధన ప్రకారం ఇసుక తదితర చిన్నతరహా ఖనిజాల క్వారీ అనుమతుల కోసం స్థానిక ఆదివాసీ వ్యక్తులు, ఆదివాసీ సహకార సంఘాలు మాత్రమే మైనింగ్ చేయాలనే నిబంధనలున్నాయి. పైసా చట్టం ప్రకారం ఏజెన్సీలో ఇసుక క్వారీలకు అనుమతులు రావాలంటే స్థానిక ఆదివాసీలకే హక్కులుండటంతో, రాజకీయనాయకులు అధికారమే పెట్టుబడిగా కొంతమంది స్థానిక ఆదివాసీలను సొసైటీగా ఏర్పాటు చేసి వారిపేర్లపై ఇసుక క్వారీల అనుమతులు తెస్తునన్నారు. విచిత్రం ఏంటంటే ఇసుక క్వారీలకు ఎవ్వరి పేరుతో అనుమతులు వచ్చాయో వారే ఆ ఇసుక క్వారీల్లో కూలీలుగా పని చేస్తున్నారు. అంటే వారే యజమానులు, వారేకూలీలు. మైనింగ్ మాఫియా కేంద్రంగా తెరకెక్కిన కే.జే.ఎఫ్ సినిమాలో మాదిరి ఆదివాసీలు ఇసుక క్వారీల్లో వెట్టి చాకీరీ చేస్తుండగా, శాండ్ మాఫియా కోట్లు దండుకుంటుంది.

భద్రాద్రిజిల్లాలో ఇసుక రీచ్‎ల్లో అక్రమాలు కొనసాగుతున్నా, కళ్లెదుటే వందల లారీలు తరలిపోతున్నా మైనింగ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఇసుక రీచ్ల ద్వారా ప్రభుత్వానికి రాయల్టీ సొమ్ములు వసూలు చేయాల్సి ఉండగా, అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇసుక క్వారీలు నడుస్తుండగా, మైనింగ్ శాఖ అక్రమాలను అరికట్టడం అటుంచి, వారి కనుసన్నల్లోనే జీరోగా ఇసుక వందల లారీలు తరలిపోతున్నట్టు ఆదివాసీ గిరిజనసంఘాలు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో పెసాచట్టాన్ని పాతరేసినట్టుగా ప్రభుత్వం తీరుందని ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నారు.

రైజింగ్ కాంట్రాక్టర్ల పేరుతో ఆదివాసీ సహకార సంఘాలకు ఇసుక రీచ్లు కెటాయించకుండా నిబంధనలకు విరుద్దంగా జిల్లా ఇసుక కమిటీలు రీచ్లను మైనింగ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కేటాయించటంపై ఏజేన్సీ ప్రాంతంలోని ఆదివాసీ సంఘాలు ఆగ్రహాంగా ఉన్నాయి. క్యూబిక్ మీటరుకు 650 వసూలు చేస్తూ అందులో 220 మాత్రమే సహకార సంఘాలకు చెల్లిస్తూ మిగతా సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేసుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో పెసాచట్టాన్ని ఉల్లంఘించి ఇసుకరీచుల్లో సాగుతున్నఅక్రమాలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని, ఆదివాసీల హక్కులను రాజ్యమే కాలరాయడం తీవ్ర అన్యాయమని ,అధికారపార్టీ నేతల అక్రమార్జనకు ఇసుక రీచ్లు కామధేనువుగా మారాయని పర్యావరణ నిబంధనులు గాలికొదిలి సాగుతున్నఅక్రమ ఇసుకదందాపై ప్రభుత్వంస్పందించకపోతే పోరాటం తప్పదని ఆదివాసీ సంఘాలు హెచ్చరించారు.

ఢిల్లీలో సీఎం సార్ ఏంచేస్తున్నారు..?

భారత్‌కు బిగ్‌ షాక్‌

మళ్లీ వర్షం.. ఆ నాలుగు జిల్లాలే టార్గెట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -