Saturday, May 4, 2024
- Advertisement -

బీర్ కొడుతూ ..ఎంజాయ్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్?

- Advertisement -

హాట్ బ్యూటీ మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే మోనాల్ తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా అల్లరి నరేష్ హీరోగా నటించిన “సుడిగాడు” సినిమా ద్వారా పరిచయం అయ్యి తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి సినిమాల్లో నటించింది. కానీ సినిమాలతో వచ్చిన గుర్తింపు కంటే ఇప్పుడు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా వచ్చిన పాపులారిటీనే ఎక్కువని చెప్పాలి.

మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఇటీవలి ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో ‘రంభ ఊర్వశి’ ఐటమ్ సాంగ్‌లో అద్భుతమైన స్టెప్పులతో, తన అందాలను ఆరబోసి కుర్రకారుకి మంచి కిక్ ఇచ్చింది. తర్వాత ప్రముఖ టెలివిజన్ లో ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “డ్యాన్స్ ప్లస్” షోలో మోనాల్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Also read:బాలయ్య పుట్టిన రోజుకు పెద్ద గిఫ్ట్.. ఏంటంటే?

డాన్స్ ప్లస్ షో లో సక్సెస్ ఫుల్ గా ఆదివారం నాడు ఫినాలె ఎపిసోడ్ ప్రసారమైంది. అందరూ అనుకున్నట్టుగానే సంకేత సహదేవ్ విజేతగా నిలిచారు. శేఖర్ మాస్టర్ చేతుల మీదగా ట్రోఫీని అందించారు. అయితే ఈ ఫినాలె ఎపిసోడ్ ను హాట్ బ్యూటీ మోనాల్ తన ఇంట్లో హ్యాపీగా టీవీ ముందు కూర్చుని కూల్ ..కూల్.. గా కూల్ బర్గ్ బీర్ కొడుతూ షో ను చూస్తూ, తెగ ఎంజాయ్ చేస్తూ డాన్స్ ప్లస్ షో కు సంబంధించిన స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకుందట.

Also read:మొదటి చిత్రం పెద్ద అద్భుతం అంటున్న కృతి సనన్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -