Monday, April 29, 2024
- Advertisement -

విశ్వాసం లో కూతురు సెంటిమెంట్.. వలిమై లో మదర్ సెంటిమెంట్

- Advertisement -

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్​కు తెలుగులో కూడా మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అజిత్​ తమిళ్ లో హెచ్ వినోద్ దర్శకత్వంలో వలిమై అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీని తెలుగులో సైతం విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో ఆర్​ఎక్స్​ 100 ఫేమ్​ కార్తికేయ విలన్​గా చేస్తున్నాడు. మాస్​ , కమర్షియల్​ చిత్రాలను తెరకెక్కించే వినోద్​.. ఈ సారి కూడా ఓ విభిన్నమైన కథాంశంతో వస్తున్నట్టు సమాచారం.

వలిమైలో కార్తికేయ పాత్ర చిత్రన, ఆయన వేషధారణ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తమిళ మీడియాలో టాక్​ వినిపిస్తోంది. ఒక వేళ ఈ మూవీ సక్సెస్​ అయితే కార్తికేయకు విలన్​ గా అవకాశాలు వెల్లువెత్తే అవకాశం ఉందని కూడా టాక్​ వినిపిస్తుంది. కార్తికేయ విభిన్న కథలను, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆర్​ఎక్స్​ 100, 90 ఎంఎల్​, చావు కబురు చల్లగా.. ఇలా అన్ని సినిమాల్లోనూ కాస్త విభిన్న తరహా పాత్రలనే ఎంచుకుంటున్నాడు కార్తికేయ.

కాగా,వలిమై మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. అదేమిటంటే ఈ చిత్రంలో తల్లి సెంటిమెంట్ ను ప్రధాన అంశంగా చూపించబోతున్నారట. అజిత్​ గత చిత్రం విశ్వాసంలో కుమార్తె సెంటిమెంట్​ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సారి తల్లి సెంటిమెంట్ ను ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మూవీ కోసం అజిత్​ ఫ్యాన్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read

మరోసారి మెగాస్టార్ తో వినాయక్..!

ఛత్రపతి హిందీ రీమేక్.. ఇక లేనట్టేనా? ఎక్కడ తేడా కొడుతోందే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -