Saturday, April 20, 2024
- Advertisement -

250 మిలియన్​ వ్యూస్​.. ‘సారంగధరియా’ రేంజ్​ ఇది

- Advertisement -

సాయిపల్లవి నటించిన సారంగధరియా పాట విడుదలైన నాటినుంచే రికార్డులు మోత మోగిస్తోంది. ఆరంభంలో కాస్త వివాదాలు వచ్చినా.. ఆ తర్వాత ఈ పాట దూసుకుపోయింది. ఇప్పుడు ఏకంగా 250 మిలియన్​ వ్యూస్​ అంటే 25 కోట్ల వ్యూస్​ సాధించింది. గతంలో రౌడీ బేబీ పేరిట సాయిపల్లవికి వ్యూస్ పరంగా గొప్ప రికార్డు కూడా ఉంది. అలాగే ఫిదాలో ‘వచ్చిందే మెల్లమెల్లగా వచ్చిందే’ పాట కూడా సంచలనం సృష్టించింది.

ఇక సారంగధరియా పాటను లవ్​స్టోరీ సినిమా కోసం శేఖర్​ కమ్ముల చిత్రీకరించారు. సుద్దాల రాసిన జానపద బాణి అన్ని వర్గల ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ముఖ్యంగా సారంగధరియా పాటకు సాయిపల్లవి అలవోకగా వేసిన స్టెప్పులు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక మంగ్లీ గొంతు కూడా కలిసొచ్చింది.

ఇటీవల టాలీవుడ్​ దర్శకులంతా జానపద బాణీల మీద పడ్డారు. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ పాట మొదటినుంచి రికార్డుల మోత మోగించింది. విడుదలైన 14 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించింది. 32 రోజుల్లో 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఈ పాట ఇప్పుడు 250 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. కరోనా సెకండ్​ వేవ్​ రాకపోతే .. లవ్​స్టోరీ చిత్రం ఈ పాటికి విడుదలయ్యేదే. కానీ కరోనా తో ఆగిపోయింది. త్వరలో విడుదలయ్యే చాన్స్​ ఉందన్న వార్తలు వస్తున్నాయి.

Also Read

కేజీఎఫ్ రూట్ లోనే సలార్ కూడా…!

పెళ్లంటే నరకం..! అంటున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -