Saturday, April 20, 2024
- Advertisement -

ఉగ్రరూపంగా బాలయ్య ‘అఖండ’ టీజర్!

- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల కొత్త సినిమా టైటిల్ ను ఉగాది సంద‌ర్భంగా ప్ర‌క‌టిస్తామ‌ని ఆ చిత్ర యూనిట్ చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు ‘అఖండ’‌ పేరును ఖ‌రారు చేసింది. మెడ‌లో ర‌ద్రాక్ష‌లు, చేతిలో త్రిశూలం, నుదిటిపై విభూదితో బాల‌కృష్ణ శివ భ‌క్తుడిగా ఇందులో క‌న‌ప‌డుతున్నారు. త్రిశూలంతోనే ఆయ‌న ఫైటింగులు చేస్తున్నారు. 

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు క్రియేట్ చేసిన హిస్టరీని జనం ఇంకా మరచిపోలేదు. “హర హర మహాదేవ్… శంభో శంకరా…” అంటూ బాలకృష్ణ విలక్షణమైన గెటప్ లో కనిపించారు. ఆ గెటప్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

“కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది…” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ కూడా అభిమానులను కిర్రెక్కిస్తున్నాయి. గతంలో లేని విధంగా బాలయ్య సినిమా టీజర్ అలా వచ్చి రాగానే ఇలా వ్యూస్ సర్రున పెరిగిపోతున్నాయి. వాటితో పాటు లైక్స్ కూడా పరుగులు తీస్తున్నాయి. 

మొత్తానికి ప్లవ నామ సంవత్సర ఉగాది కానుకగా ‘అఖండ’ అభిమానులకు ఆనందం పంచుతోంది. యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న జనం ముందుకు రానున్న ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేయనుందో అన్న ఆసక్తి కూడా సినీ ఫ్యాన్స్ లో నెలకొంది. 

అందరూ బాగుండాలని కోరుకున్న రాష్ట్రపతి..!

నటుడు, నిర్మాత కుమారజన్‌ ఆత్మహత్య

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -