Saturday, April 20, 2024
- Advertisement -

బిడ్డకి తల్లి కావాలి అని శిక్ష నుంచి విముక్తి.. అసలు కథ ఏమిటంటే..!

- Advertisement -

అక్రమ మద్యం కేసులో అరెస్టయిన తల్లికి బెయిల్ మంజూరు చేసింది మధ్యప్రదేశ్​ హైకోర్టు. తక్షణం జైలు నుంచి ఆమెను విడుదల చేయాలని జస్టిస్​ సుజోయ్​ పాల్​ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఇందుకోసం నిందితురాలు రూ.30వేలు సహా అంతే మొత్తాన్ని పూచికత్తుగా కూడా చెల్లించాలని పేర్కొంది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఎనిమిది నెలల కుమారుడికి తోడుగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఇండోర్​లో ఆదివారం జరిగింది. సెలవురోజు కూడా విచారణ చేపట్టి కోర్టు బెయిల్​ మంజూరు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తల్లికి దూరంగా ఉండటం వల్లే చిన్నారి ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు వెల్లడించారు.నిందితురాలు ఖుషీ యాదవ్ సహా మరో ఇద్దరు మహిళలు​ అక్రమ మద్యం విక్రయిస్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి గత నెల 29న పోలీసులు 197 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు నిమిత్తం స్థానిక కోర్టు ఈ నిందితులకు జుడీషియల్​​ కస్టడీని విధించింది.

నటుడు, నిర్మాత కుమారజన్‌ ఆత్మహత్య

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

నేటి పంచాంగం, మంగళవారం (13-04-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -