Thursday, March 28, 2024
- Advertisement -

బాలయ్య -అనిల్ కాంబినేషన్ లో మూవీ పక్కా..!

- Advertisement -

అనిల్ రావిపూడి తాను దర్శకత్వం వహించిన మొదటి సినిమా పటాస్ తర్వాతి నుంచి బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అది ఫలించలేదు. ఆ వార్తలు రూమర్లు గానే మిగిలిపోయాయి. తాజాగా ఎఫ్3 తర్వాత అనిల్ బాలయ్య సినిమాకు దర్శకత్వం వస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి.అయితే కొద్ది రోజులుగా అనిల్ తో బాలకృష్ణ సినిమా ఉండకపోవచ్చని, అనిల్ మహేష్ బాబు కోసం ఒక కథ సిద్ధం చేశారని న్యూస్ వచ్చింది.

అయితే ఆ తర్వాత మహేష్ డేట్స్ ఇప్పట్లో దొరకడం కష్టమని భావించి అదే కథతో పవన్ కళ్యాణ్ తో అనిల్ సినిమా చేస్తారని ప్రచారంలోకి వచ్చింది. కాగా రెండు రోజుల కిందట బాలకృష్ణ జన్మదినం జరుపుకున్నారు. ఆరోజు గోపీచంద్ మలినేని- బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే అనిల్ రావిపూడి సినిమా గురించి ప్రస్తావన రాలేదు. దీంతో ఇక బాలయ్య -అనిల్ సినిమా ఉండదని అంతా భావించారు. అనిల్ పవన్ తోనే సినిమా చేస్తారని అనుకున్నారు.

Also Read: తారక్​ పొలిటికల్​ ఎంట్రీపై బాలయ్య రియాక్షన్​ ఇదే..!

కానీ ఈ రూమర్లు అన్నిటికీ బాలకృష్ణ బ్రేక్ వేశారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో ఆయన జూమ్ యాప్ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నకు అనిల్ రావిపూడి తో తన సినిమా ఉంటుందని, గోపీచంద్ తో సినిమా తర్వాత ఆ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పడంతో బాలయ్యతో అనిల్ సినిమా పక్కా అని స్పష్టమైంది. ఎఫ్ 3 తర్వాత అనిల్ బాలయ్య సినిమాకు సంబంధించిన ఈ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టనున్నారు.

Also Read: సౌత్​లో బన్నీ కొత్త రికార్డ్​.. విజయ్​ ని కూడా దాటేశాడే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -