Thursday, April 18, 2024
- Advertisement -

మరో సేవకు రియల్ హీరో శ్రీకారం.. ఐఏఎస్ కు ప్రిపేరవుతున్న వారికి ఉచిత శిక్షణ

- Advertisement -

గత ఏడాదిన్నర కాలంగా ప్రముఖ నటుడు సోనుసూద్ కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడమే కాక, దేశవ్యాప్తంగా ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నారు. అంతే కాదు తన దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా ఆయన పరిష్కరిస్తున్నారు. తాజాగా మరోసేవకు సోనూసూద్ శ్రీకారం చుట్టాడు. ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.

సివిల్ సర్వీసెస్​ కోసం ప్రిపేర్​ అవుతున్న వారికి సంభవం పేరిట కోచింగ్​ స్కాలర్​షిప్స్​ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం విద్యార్థులు soodcharityfoundation.org సైట్​లో జూన్​ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.ఐఏఎస్ కోసం సిద్ధం కావాలని అనుకుంటున్నారా.. మీ బాధ్యత మేం తీసుకుంటాం.. సంభవం ప్రారంభం గురించి ప్రకటిస్తున్నందుకు థ్రిల్లింగా ఉంది’ అని సోనూ సూద్ ట్వీట్ చేశారు.

Also Read: తన భార్యది ఆంధ్రప్రదేశ్​ కావడం తనకెంతో గర్వకారణం.. సోనూసూద్

దేశవ్యాప్తంగా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సోనూ కల్పించారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరితో శభాష్ అనిపించుకుంటున్న సోనూ సూద్ మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. నిజం చెప్పాలంటే సివిల్స్ కు శిక్షణ తీసుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఇందుకు ఏ ఆరునెలల కాలమో శిక్షణ తీసుకుంటే సరిపోదు. జాబ్ వచ్చేవరకు ఏళ్ల తరబడి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖర్చు భరించలేకే నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఎంతోమంది విద్యార్థులు సివిల్స్ కు ప్రిపేర్ కావడం లేదు. అలాంటి విద్యార్థులకు సోనూసూద్ ప్రారంభించిన సంభవం సంస్థ ఎంతో ఉపయోగపడనుంది.

Also Read: సోనూసూద్​ .. మరో సంచలన నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -