Wednesday, April 24, 2024
- Advertisement -

తారక్​ పొలిటికల్​ ఎంట్రీపై బాలయ్య రియాక్షన్​ ఇదే..! ప్లస్​ అయి మైనస్​ అయితే..!

- Advertisement -

జూనియర్​ ఎన్టీఆర్​ పొలిటికల్​ ఎంట్రీ .. తెలుగుదేశం పార్టీలో హాట్​ టాపిక్​గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్​ రాజకీయాల్లోకి వస్తేనే ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పలువురు టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో సైతం ఇటువంటి డిమాండ్​ వినిపించింది. కొందరు కార్యకర్తలు ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు వద్దే ఈ వాదన వినిపించారు.

మరోవైపు ఇటీవల ఎన్టీఆర్​ రాజకీయాల్లోకి రావాలంటూ కుప్పం నియోజకవర్గంలో జెండాలు ఎగరేశారు ఫ్యాన్స్​. నిజానికి ఇది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మింగుడుపడని అంశం. ఎందుకంటే ఆయన తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో లోకేశ్​ను ఎమ్మెల్సీగా చేసి.. మంత్రి పదవి కూడా అప్పజెప్పారు. కానీ లోకేశ్​ లో ఆశించిన స్థాయిలో నాయకత్వ లక్షణాలు లేవు.ఆయన రాజకీయ ప్రసంగాలు చూసిన వారికి ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది.

Also Read: ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్​పై క్యాడర్​ నిరుత్సాహం

మరోవైపు చంద్రబాబుకు వయసు మీద పడుతోంది. ఈ క్రమంలో జూనియర్​ ఎన్టీఆర్​ పార్టీలోకి రావాలన్న డిమాండ్​ వినిపిస్తున్నది. ఇదే విషయంపై నిన్న నందమూరి బాలకృష్ణ స్పందించారు. నిజానికి జూనియర్​ రాజకీయాల్లోకి రావడం ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే. ఈ క్రమంలో బాలకృష్ణ.. నిన్న ఓ మీడియా చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు.

ఆయన ఏమన్నారంటే.. ‘ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తాను పెద్దగా ఆలోచించడంలేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక ఆవేశంలోంచి పుట్టిందని అన్నారు. ఇందులో క్లీన్‌ గా ఉండే వాళ్లకే పేరు, గుర్తింపు వస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే పార్టీకి ప్లస్ అవుతుందా? అనే రిపోర్టర్ల ప్రశ్నకు బాలయ్య చిరునవ్వుతో దాటవేశారు. ప్లస్ అయి మైనస్ అయితే ’ అంటూ ఏమీ అర్థంకాకుండా చెప్పేశాడు బాలయ్యబాబు.

Also Read: లోకేశ్​ నిన్ను హెరిటేజ్​ దున్నపోతు అనాలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -