Thursday, April 25, 2024
- Advertisement -

జగన్.. చంద్ర బాబు ఒకే వేదిక మీద..!

- Advertisement -

విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నేతలు చేపట్టిన దీక్షలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతుండగా… ఆయన పక్కనే మంత్రి అవంతి శ్రీనివాస్, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉన్నారు.

వీరిద్దర్నీ ఉద్దేశిస్తూ… ‘మంత్రి అవంతి శ్రీనివాస్ పై ఒక బాధ్యత ఉంది. ఎమ్మెల్యే గంటాపై ఒక బాధ్యత ఉంది. జగన్​ను అవంతి తీసుకువస్తే.. చంద్రబాబును గంటా తీసుకురావాలి. ఆ ఇద్దరూ ఒకే వేదికపైకి వస్తే స్టీల్ ప్లాంట్​ను తప్పక సాధిస్తాం’ అంటూ నారాయణ వ్యాఖ్యలు చేశారు.

వెంటనే స్పందించిన మంత్రి అవంతి.. జగన్, చంద్రబాబుకు నారాయణ స్నేహితుడని, ఆయన ఈ బాధ్యత తీసుకుంటే బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తూ వెళ్లిపోయారు. ఏది ఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నాయకులు తీసుకుంటున్న స్టాండ్ ముందు ముందు మహా ఆసక్తి రేపుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కొత్త సినిమాతో రాబోతున్న నాని! హిట్ కొట్ట‌నున్నాడా ?

ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం..రాతపూర్వక అంగీకారం..!

‘ప్రేమికుల రోజు’న ప్ర‌భాస్ స్పెష‌ల్ గిఫ్ట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -