Wednesday, May 22, 2024
- Advertisement -

నానితో రొమాన్స్‌కు రెడీ అయిన‌ క‌న్నుగీటు భామ‌

- Advertisement -

ప్రియ ప్ర‌కాష్ వారియ‌ర్‌…. ఒక్క సినిమా కూడా విడుద‌ల కాకుండానే నేష‌న‌ల్ లేవ‌ల్లో పాపుల‌ర్ అయింది.ఒకే ఒక్క కన్నుగీటుతో వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ దక్కించుకుంది. స‌న్ని లియోన్‌, దీపిక ప‌దుకునే వంటి స్టార్ హీరోయిన్స్‌ను సైతం వెన‌క్కినెట్టి గూగుల్ సెర్చ్‌లో అత్య‌ధికులు సెర్చ్ చేసిన హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఒరు ఆధార్ లవ్ టీజర్ యావ‌త్ భార‌త‌దేశాన్ని మొత్త‌న్ని త‌న మాయంలో వేసుకుంది ఈ భామ‌.ప్రస్తుతం ప్రియా నటించిన ఒరు ఆధార్ లవ్ తెలుగులో లవర్స్ డే పేరుతో రిలీజవుతోంది.

ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా దూసుకొస్తోంది. తాజాగా ప్రియా ప్ర‌కాష్ త‌న తొలి సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. న్యాచుర‌ల్ స్టార్ నానితో విక్ర‌మ్ కుమార్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.తాజా ఈ చిత్రానికి ప్రియా ప్ర‌కాష్‌ని ఆడిషన్స్‌కి పిలిచారట. ఆడిషన్స్ ఫోటో షూట్స్ లో మెప్పిస్తే ప్రియాని జాక్ పాట్ వరించినట్టే. ఇక బ‌న్ని సినిమాలో కూడా ప్రియా ప్రకాష్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌లు నిజ‌మైతే క‌నుక ప్రియా ప్ర‌కాష్ ద‌శ మారిన‌ట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -