Tuesday, May 14, 2024
- Advertisement -

అనాథ పిల్లలకు ట్రూజెట్ గగన విహారం!

- Advertisement -

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప యాత్ర
గండికోట, కడప దర్గా తదితర ప్రదేశాల సందర్శన
27న తిరిగి హైదరాబాద్కు రాక
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనాథ పిల్లలకు ట్రూజెట్ అద్భుత అవకాశాన్ని కల్పించింది. చిన్నారులు కలలో సైతం ఊహించని విమానయానాన్ని ఉచితంగా అందించింది. చిన్నారు ఆశలు, కలలను పండిరచే విధంగా, వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ట్రూజెట్ ‘వింగ్స్ ఆఫ్ హోప్’ కార్యక్రమాన్ని గత ఏడాది కాంగా నిర్వహిస్తోంది. విమాన ప్రయాణం చేయగలిగే స్థోమత లేని పిల్లలకు విమానయాన అవకాశాన్ని ఉచితంగా కల్పించడంతోపాటు వారిని వివిధ సందర్శనీయ ప్రాంతాలకు తీసుకెళుతోంది. వింగ్స్ ఆఫ్ హోప్`3లో భాగంగా శనివారం ట్రూజెట్ అనాథ పిల్లలకు హైదరాబాద్ నుంచి కడపకు ఉచితంగా తీసుకెళ్లింది.

హైదరాబాద్లోరి చార్మినార్కు చెందిన ఆశ్రిత రేయిన్ బో ఫౌండేషన్తోపాటు గాజురామారంలోని కేర్ అండ్ లవ్ స్వచ్ఛంద సంస్థకు చెందిన 30 మంది చిన్నారులు, సిబ్బందిని శనివారం ట్రూజెట్ ఉచితంగా తమ విమానంలో కడపకు తీసుకెళ్లింది. శనివారం ఉదయం 9:15 గంటలకు చిన్నారులు ట్రూజెట్ విమానంలోకి ఉత్సాహంగా అడుగుపెట్టారు. విమానం గాలిలోకి ఎగురుతున్న సమయంలో చిన్నారులు ‘జింగ్.. జింగ్.. అమేజింగ్’ అంటూ.. పట్టరాని ఆనందంతో కేరింతలు కొట్టారు. పలువురు చిన్నారులు విమానం కిటికీలో నుంచి బయటకు చూస్తూ తమ ఆనందాన్ని ఒకరినొకరు పంచుకున్నారు. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కా లని అనుకున్నానని, అయితే ట్రూజెట్ ద్వారా తన కల నెరవేరిందని తొమ్మిదో తరగతి విద్యార్థిని వైష్ణవి చెప్పారు. చాలా ఉత్సాహంగా అనిపించిందని, భయం కలుగలేదని దుర్గాదేవి అనే విద్యార్థిని పేర్కొన్నారు. తొలిసారి విమానయానం చేస్తుండటంతో తనకు కొద్దిగా భయం అనిపించిందని, అయినప్పటికీ విమానం పైకి ఎగిరిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించిందని నాలుగో తరగతి చదువుతున్న నోయల్ అనే విద్యార్థి పేర్కొన్నారు.

కడపలోని ప్రముఖ సందర్శనీయ ప్రాంతాకు చిన్నారులను ట్రూజెట్ తీసుకెళ్లింది. శనివారం విమానం దిగిన తర్వాత చిన్నారులను ట్రూజెట్ తన సొంత వాహనాల్లో పుష్పగిరి ఆలయానికి తీసుకెళ్లింది. ఆ తర్వాత అక్కడి నుంచి గండికోటకు వెళ్లారు. గండికోట చూడటానికి విద్యార్థులు చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అనంతరం కడప చేరుకున్న విద్యార్థులను ప్రఖ్యాత కడప దర్గాకు తీసుకెళ్లారు. ఆలయాలతోపాటు ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలను చిన్నారులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం 10:25 గంటకు ట్రూజెట్ తన విమానంలో తిరిగి చిన్నారులను కడప నుంచి హైదరాబాద్ తీసుకురానుంది. రాకపోకలకు విమాన సదుపాయంతోపాటు కడపలో వివిధ ప్రాంతాల సందర్శన, వసతి సదుపాయాలకు, ఇతర ఖర్చును ట్రూజెట్ సొంతంగా భరించింది.


ట్రూజెట్ తన వింగ్స్ ఆఫ్ హోప్ కార్యక్రమం ద్వారా 300 మంది విద్యార్థును దశలవారీగా ఉచిత విమాన ప్రయాణం కల్పించాని నిర్ణయించింది. ఇందులో భాగంగా వాల్మికీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన హంపికి వెళ్లేందుకు గానూ 40 మంది విద్యార్థులను హైదరాబాద్ నుంచి బళ్లారికి ఉచితంగా ట్రూజెట్ విమానంలో తీసుకెళ్లింది. గతేడాది బాల దినోత్సవం సందర్భంగా విద్యా, విజ్ఞాన యాత్రకోసం చెన్నై వచ్చిన తమిళనాడులోని ఎస్ఆర్వీవీ పాఠశాలకు చెందిన 40 మంది పేద విద్యార్థును చెన్నై నుంచి సేలంకు ట్రూజెట్ ఉచితంగా తీసుకెళ్లింది. గతేడాది కేరళలో ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు సైతం బాధితులను ఆదుకునేందుకు ట్రూజెట్ ప్రత్యేక విమాన సర్వీసును నడిపింది. చెన్నై నుంచి బాధితుకు వస్తు సామగ్రిని తీసుకెళ్లడంతోపాటు తిరుగు ప్రయాణంలో తిరువనంతపురం వరదల్లో చిక్కుకున్న వారిని చెన్నైకు తీసుకెళ్లింది. ఆ విధంగా మూడు రోజు పాటు షెడ్యూల్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 13 నుంచి నాసిక్, ఇండోర్కు ట్రూజెట్ విమాన సర్వీసు:

టర్బో మేఘా ఏయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ట్రూజెట్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నది. ప్రస్తుతం 5 విమానాతో 17 మార్గాల్లో తన సేవలను అందిస్తున్నది. విమానయాన సదుపాయం అంతగా లేని ప్రముఖ వ్యాపార కేంద్రాలు, పట్టణాలకు ట్రాజెట్ విమనాలను నడుపుతున్నది. హైదరాబాద్, చెన్నై, ముంబై, గోవా, ఔరంగాబాద్, సేలం, మైసూర్, బళ్లారి, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, కడప, విద్యానగర్, నాందేడ్ తదితర ప్రాంతాలకు ట్రూజెట్ విమానసేవలు అందిస్తున్నది. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ మార్గంలో విమానాలను నడుపుతున్న ఏకైక సంస్థ ట్రూజెట్ మాత్రమే.

ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి ట్రూజెట్ మరో రెండు కొత్త మార్గాల్లో విమాన సర్వీసులు ప్రారంభించనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ఇండోర్, నాసిక్కు విమాన సేవలు ప్రారంభిస్తోంది. ఇప్పటికే పశ్చిమ భారతంలో అహ్మదాబాద్ కేంద్రంగా పోర్బందర్, జైసల్మేర్కు విమాన సర్వీసులను నడుపుతున్నది. హైదరాబాద్ తర్వాత అహ్మదాబాద్ ట్రూజెట్కు రెండో బేస్ స్టేషన్. త్వరలో ట్రూజెట్ మరో రెండు ఏయిర్ క్రాఫ్ట్ను ప్రవేశపెట్టనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -