ఓ ప్రత్యేకమైన కథతో.. రొటిన్ సినిమాలు కాకుండా.. డిఫరెంట్ గా ఉండే సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నారా రోహిత్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వరస సినిమాలు చేస్తున్నాడు. కానీ మొదటి నుంచి ఈ హీరో సైజ్ పై విమర్శలు పడుతునే ఉన్నాయి.
{loadmodule mod_custom,GA1}
తను స్లిమ్ గా మారతానంటూ ఇప్పటికి చాలా సార్లు చెప్పాడు. అభిమానులకు కూడా మాట ఇచ్చడు. కానీ నిలబెట్టుకోలేకపోయాడు. కానీ గత ఆరు నెలలుగా మాత్రం నారా రోహిత్ తెగ కష్టపడిపోతున్నాడు. గంటల తరబడి జిమ్ లో వర్కవుట్స్ చేస్తూనే ఉన్నాడు. రోజూ ఉదయం 3 గంటలు.. సాయంత్రం 3-4 గంటలు కష్టపడుతున్నాడు నారా రోహిత్. ఇలా దాదాపు 6 నెలలు వర్కవుట్స్ చేస్తే.. ఇప్పుడు తగిన షేప్ లోకి రాగలిగాడు ఈ నారావారి అబ్బాయి. ఈ సమయంలో 15 కిలోల బరువు తగ్గించుకుని కొత్త లుక్ లోకి వచ్చేశాడు.
{loadmodule mod_custom,GA2}
ఇప్పుడు కుర్ర హీరోల మల్టీస్టారర్ సినిమా శమంతకమణి మూవీలో తన కొత్త లుక్ లోనే నటిస్తున్నాడు నారా రోహిత్. ఈ షేప్ లోకి వచ్చేందుకు నారా రోహిత్ చాలా శ్రమించాడని.. 6 నెలలు ఏ మాత్రం గ్యాప్ తీసుకోలేదని సన్నిహితులు అంటున్నారు. ఇది కాకుండా.. ప్రస్తుతం కథలో రాజకుమారి.. వీరభోగ వసంతరాయలు.. పండగలా వచ్చాడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు నారా రోహిత్.
{youtube}3vpZWmRr56Q{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
