Friday, April 26, 2024
- Advertisement -

కండిషన్స్ అప్లై అంటున్న లేడీ సూపర్‌ స్టార్

- Advertisement -

దర్శకుడు విష్నేశ్‌ శివన్‌ను ఇటీవలే వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది నటి నయనతార. అయితే పెళ్లైన తర్వాత నయన్.. సినిమాల చేస్తుందా.. ? ఫిల్మ్‌ ఇండస్ట్రీకి గుడ్‌బై చెబుతుందా అని ఇప్పటివరకు ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులకు ఈ లేడీ సూపర్ స్టార్ క్లారిటీ ఇచ్చింది. సినిమాలు చేస్తాను కానీ కండీషన్స్ అప్లై అంటూ స్పష్టం చేసింది. వివాహం తర్వాత చాలా మంది నటీమణులు సినిమాలకు దూరమయ్యారు. రెండింటినీ సమతుల్యం చేసుకుంటున్న వారూ ఉన్నారు.

అయితే నయన తార మాత్రం ఇంక గ్లామర్ పాత్రలు చేయబోనని తేల్చి చెప్పేసింది. ఇకపై తనని సంప్రదించబోయే దర్శక నిర్మాతలు గ్లామర్ రోల్స్ కోసం కాకుండా ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో రావాలని కండీషన్ పెట్టింది. వాస్తవానికి చాలా కాలంగా నయన్ గ్లామర్‌ రోల్స్ చేయట్లేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనే నటిస్తోంది.

దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయన తార, విష్నేశ్‌ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో గాడ్‌ ఫాదర్, హిందీలో షారూఖ్‌తో జవాన్ చిత్రాలు చేస్తోంది. వీటితో పాటు మరి కొన్ని సినిమాలకు సైతం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read

1.పవన్ కల్యాణ్ స్థానంలో సత్యదేవ్

2.ప్రభాస్ ఫ్యాన్స్‌ను వణికిస్తున్న సెంటిమెంట్

3.మహేశ్ బాబు మూవీలో రష్మిక.. పూజాను తప్పించారా.. ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -