జగన్ కు మరో తలనొప్పి ?

- Advertisement -

ఏ పార్టీలోనైనా వర్గపోరు అనేది సర్వసాధారణం..కొన్ని నియోజిక వర్గాలలో లోకల్ గా ఉండే ఎమ్మేల్యేలు, ఎంపీలు, పార్టీ ఇంచార్జ్ ల మద్య అప్పుడప్పుడు ఈ వర్గ పోరు అనేది బయటపడుతూనే ఉంటుంది. ఇలా ఒకే నియోజిక వర్గం, ఒకే పార్టీకి చెందిన నేతల మద్య విభేదాలు అపుడప్పుడు పార్టీ అధిష్టానానికి తీరని నష్టం చేస్తూంటాయి. తాజాగా వైసీపీ లో కూడా ఈ వర్గ పోరు పెరిగిపోవడంతో సొంత పార్టీలో చెలరేగుతున్న ఈ విభేదాలు జగన్ కు తలనొప్పిగా మారాయి. ఆ మద్య నందికొట్కూర్ నియోజిక వర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్ కు మరియు శాప్ చైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కి మద్య చెలరేగిన విభేదాలు రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే..

ఇటీవల విశాఖా సౌత్ నియోజిక వర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ గొడవ సద్దుమనిగింది అనుకునే లోపే గన్నవరంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు మద్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా హిందూపురం నియోజిక వర్గంలో చెలరేగిన అసమ్మతి సెగలు సి‌ఎం జగన్ను తాకాయి. హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ మరియు పార్టీ మాజీ సమన్వయ కర్త వేణుగోపాల్ రెడ్డి మద్య ఎప్పటినుంచో అసమ్మతి పోరు నడుస్తోంది. దాంతో వీరిద్దరి మద్య సయోద్య కుదుర్చేందుకు నేరుగా జగన్ రంగంలోకి దిగినట్లు సమాచారం.

- Advertisement -

ప్రస్తుతం హిందూపురం టిడిపి కంచుకోట గా ఉంది. ఇక్కడ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురంలో వైసీపీ జెండా ఎగురవేయ్యాలని జగన్ దృడ నిశ్చయంతో ఉన్నారట. అందువల్ల హిందూపురంలో నెలకొన్న అసమ్మతి విభేదాలను త్వరగా సద్దుమాపి పార్టీని బలోపేతం చేసేందుకు సి‌ఎం జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. మరి హిందూపురంలో ఈ సరైన వైసీపీ జెండా పాతుతుందో లేదో చూడాలి.

Also Read

1.చంద్రబాబు ప్లాన్ అధిరిందిగా !

2.అలా చేస్తే కే‌సి‌ఆర్ కు బిగ్ షాక్ తప్పదా ?

3.బీజేపీ టార్గెట్ ఏపీనే ..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -