మహేశ్ బాబు మూవీలో రష్మిక.. పూజాను తప్పించారా.. ?

- Advertisement -

అతడు, ఖలేజా తర్వాత తాజాగా మహేశ్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 28గా పిలుస్తున్న ఈ మూవీ కోసం అర్జునుడు అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితారా ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో పూజా హెగ్డేను హీరోయిన్ గా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఇదే మూవీలో రష్మిక హీరోయిన్ అంటూ వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే , మహేశ్ బాబుతో చేసిన మహర్షి సినిమా సూపర్ హిట్ అయింది.

- Advertisement -

అలాగే రష్మిక, మహేశ్ బాబు కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవరు కూడా హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్లతో ఈ మూవీలో మహేశ్ చేస్తారా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also Read

ప్రభాస్ ఫ్యాన్స్‌ను వణికిస్తున్న సెంటిమెంట్

రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబోలో ప్రభాస్ హీరోయిన్…!

విక్రమ్ డైరెక్టర్ తో రామ్ చరణ్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -