ప్రభాస్ ఫ్యాన్స్‌ను వణికిస్తున్న సెంటిమెంట్

పాన్ ఇండియా మూవీస్‌తో బిజీబిజీగా ఉన్న ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ మూవీగా రూపొందిస్తున్న ఆదిపురుష్‌లో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. సీత పాత్రలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. ఏకంగా ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెకిస్తున్న ఈ మూవీకి ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.

అయితే సీత చిన్నప్పటి జీవితం, రాముడితో జానకి పెళ్లి వరకు జరిగిన విషయాలతో కూడిన ఎపిసోడ్‌ ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్నారు. సీత తండ్రి జనకమహారాజు పాత్రలో ఎవరిని తీసుకోవాలని చాలా ఆలోచించిన దర్శకుడు చివరకు సీనియర్ నటుడు కృష్ణంరాజును ఎంచుకున్నారట. రెబల్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ కలిసి నటిస్తుండటంతో ఒకపక్క ఆనందంగానే ఉన్నా.. అభిమానుల మరో భయం వెంటాడుతోందట.

ప్రభాస్, కృష్ణంరాజు కలిసి నటిస్తే ఆ సినిమాలు డిజాస్టర్స్ అవుతాయనే సెంటిమెంట్‌ వారిని వణికిస్తోంది. వీరిద్దరు కలిసి నటించిన ‘బిల్లా’, ‘రెబల్‌’, ‘రాధే శ్యామ్’ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ సెంటిమెంట్ ఈ సారి వర్కైట్ కాకూడదని కోరుకుంటున్నారు అభిమానులు.

Also Read

పుష్ప 2 సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న బన్నీ

రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబోలో ప్రభాస్ హీరోయిన్…!

లెక్చరర్ గా పవన్ కల్యాణ్

Related Articles

Most Populer

Recent Posts