Monday, April 29, 2024
- Advertisement -

శృతిహాసన్ ను మంత్రగత్తె అన్న నెటిజన్లు… శృతి రియాక్షన్ ఇదే!

- Advertisement -

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హసన్ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకున్న ఆమెకు తరువాత వరుస ఫ్లాపులు ఎదురవడంతో కొన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా ఈ ఏడాది రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించి హిట్ కొట్టిన శృతిహాసన్ కి ప్రస్తుతం వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న శృతిహాసన్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏదో ఒక ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ ఒక ఫోటోని షేర్ చేశారు. బ్లాక్ లిప్ స్టిక్ పెట్టుకొని ఉన్న ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఆమెకి మంత్రగత్తెలా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also read:వారి వల్ల నాకు అవకాశాలు తగ్గలేదు: నటి అంజలి

ఈ విధంగా నెటిజెన్స్ చేసిన కామెంట్లకు ఏమాత్రం ఆగ్రహం చెందకుండా శృతిహాసన్ వారు చేసిన కామెంట్లను కాంప్లిమెంట్ గా స్వీకరించింది. ఈ క్రమంలోనే శృతిహాసన్ మాట్లాడుతూ నేను విగ్రహారాధన తో పెరిగాను, లోహ వస్తువులను ప్రేమిస్తున్నాను నేను నిజంగానే చుడైల్ (మంత్రగత్తె) అన్నారు. మీరు అన్నది చాలా బాగుంది మంత్రగత్తెలు చెడ్డ వారు కనుక నేను ఆ లుక్ ను ప్రేమిస్తున్నానంటూ నెటిజన్లు చేసిన కామెంట్ కు రీట్వీట్ చేశారు. ఇకపోతే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శృతిహాసన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలు ప్రభాస్ సరసన నటిస్తున్నారు.

Also read:జిమ్ వేర్ ఘాటుగా అందాలను ఆరబోసిన చందమామ.. ఫోటో వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -