Tuesday, May 7, 2024
- Advertisement -

లాక్ డౌన్ ఆలోచనలో మరో రాష్ట్రం!

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం వాయిస్తుంది. రోజువారీ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో కొత్తగా 3,60,960 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267 కి చేరింది. ఇక దేశంలో కొత్తగా రికార్డ్ స్థాయిలో 3293 మంది మరణించారు. ముఖ్యంగా మహారాష్ట్ర కరోనాకు పుట్టినిల్లుగా మారింది.

ఆ తర్వాత ఢిల్లీ, బీహార్, తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదే స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో మరణాలు కూడా సంబవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇక మరో రాష్ట్రం కూడా లాక్ డౌన్ దిశగా ముందుకు వెళ్లబోతున్నట్లు సమాచారం.

బీహార్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 38 జిల్లాలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈరోజు కూడా అయన అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్ష అనంతరం లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ప్రజలు మాస్క్ పెట్టుకునేలా, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

షర్మిలకు షాక్ ఇచ్చిన టీ సర్కార్

అస్సాంలో భారీ భూకంపం..

తెలంగాణలో కరోనా విజృంభణ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -