Monday, April 29, 2024
- Advertisement -

తెలుగు తెరపై మరో నటవారసురాలు

- Advertisement -

టాలీవుడ్ లో ఎంతో మంది హీరో, హీరోయిన్ల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొంత మంది హీరోయిన్లు గా రాణించారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ బాటలో నడిచారు. 90వ దశకంలో తన అందచందాలు మాత్రమే కాదు.. యాక్షన్ లేడీగా పేరు తెచ్చుకుంది వాణి విశ్వనాథ్. తెలుగులో హీరోయిన్ గా వాణీ విశ్వనాథ్ కొంతకాలం పాటు తన జోరు చూపించారు.

ఆ తర్వాత మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అక్కడే స్థిరపడిపోయారు. ఆ మద్య జయ జానకీ నాయకా చిత్రంలో కనిపించారు. వెండి తెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా వాణి విశ్వనాథ్ తన సత్తా కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె వారసురాలిగా వర్ష విశ్వనాథ్ పరిచయమవుతోంది.

ఇప్పటికే రెండు మూడు తమిళ చిత్రాల్లో నటించిన వర్ష విశ్వనాథ్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం అవుతుంది. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి జోడీగా నటిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

నేటి పంచాంగం, మంగళవారం (4-5-2021)

క్వారంటైన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న బుట్ట బొమ్మ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -