Friday, March 29, 2024
- Advertisement -

వామ్మో.. పుష్ప షూటింగ్ వెనుక అంత ప్లాన్ ఉందా?

- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన సినిమాలు ఇతర దర్శకులతో పోలిస్తే ఎంతో విభిన్నంగా ఉంటాయి. సినిమాలలోకి రాకముందు లెక్కల మాస్టర్ గా పనిచేసిన సుకుమార్ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే సుకుమార్ తాజాగా అల్లు అర్జున్ హీరోగా “పుష్ప” సినిమాను తెరకెక్కిస్తున్నారు. గత రెండు రోజుల వరకు ఈ చిత్ర షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో మిగిలిన దర్శకులందరూ సినిమా షూటింగ్ వాయిదా వేసుకుని ఇళ్లకే పరిమితం కాగా సుకుమార్ మాత్రం కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పుష్ప షూటింగ్ జరుపుతున్నారు. ఈ విధంగా సుకుమార్ షూటింగ్ జరపటానికి గల కారణం ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాజిల్ అని చెప్పవచ్చు.ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమాతో పాటు మరెన్నో సినిమాల్లో నటిస్తున్నారు.

Also read:ప్రేమలో పడిన యాంకర్ వర్షిని.. ఫోటోలు వైరల్!

ఈ క్రమంలోనే అతని డేట్స్ దొరకడం చాలా కష్టం. కరోనా ప్రభావం వల్ల ఇతర సినిమాలన్నీ వాయిదా పడటంతో ఫహద్ ఫాజిల్ పూర్తి సమయాన్ని పుష్ప సినిమాకి కేటాయించారు. దీంతో సుకుమార్ అతనిపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు అన్నింటిని షూటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే గత రెండు రోజుల క్రితం ఫహద్ ఫాజిల్ స్వయంగా షూటింగ్ నుంచి తప్పుకోవడంతో మళ్లీ ఆయనే డేట్స్ కేటాయిస్తారని సుకుమార్ భావిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరో అల్లుఅర్జున్ కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే ముందుగా అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల చేస్తారా లేదా అనే విషయం గురించి చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది.

Also read:అతనితో ఒకే బెడ్ పై అలా ఉన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటో వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -