Saturday, April 27, 2024
- Advertisement -

నితిన్ ‘మాస్ట్రో’ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్!

- Advertisement -

జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నయంగ్ హీరో నితిన్. దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ కెరీర్ లో చెప్పుకోదగ్గ భారీ హిట్ చిత్రాలు లేకున్నా కెరీర్ పరంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించాడు. ‘భీష్మ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నితిన్ ‘చెక్’ తో మూవీతో డీలా పడిపోయాడు, ఆ తరువాత వచ్చిన ‘రంగ్ దే’ ఫరవాలేదనిపించుకుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ జోడీగా నభా నటేశ్ నటిస్తోంది.

ఈ రోజున ‘శ్రీరామనవమి’ కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ ను వదిలారు. స్కూటర్ ను నభా నటేశ్ నడుపుతూ ఉండగా.. అంధుడి పాత్రను పోషిస్తున్న నితిన్ ఆమె వెనక కూర్చుని ఉన్నాడు. పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. తమన్నా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, జిషు సేన్ గుప్తా పాత్ర కీలకం కానుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, జూన్ 11న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

టీడీపీకి లోకేష్ అనే వైరస్ పట్టుకుంది.. వర్మ సంచలన ట్విట్!

ప్రైవేట్ టీచర్లకు నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ!

టాలీవుడ్‌లో విషాదం.. నిర్మాత CN రావు మృతి!

తిరుమలలోనే అంజనీపుత్రుడి జననం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -