మరోసారి నితిన్ తో జతకట్టనున్న రష్మిక..!

- Advertisement -

రష్మిక మందన్న.. టాలీవుడ్ లో అడుగు పెట్టిందో లేదో ఆమె ఏ సినిమాలో నటించిన అది బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. అందుకే ఆమె లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. సినిమాల్లోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే అగ్ర హీరోయిన్ మారింది. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తోంది. రష్మిక మందన్న నటిస్తున్న అన్ని సినిమాలు అగ్ర హీరోలవే. ఇప్పటికే కన్నడతో పాటు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో పట్టు సాధించేందుకు దృష్టి సారించింది.

తాజాగా రష్మికకు తమిళ హీరో విజయ్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. అలాగే ఆమె రెండు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇక తెలుగులో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్పలో నటిస్తున్న రష్మిక మరో సినిమా చేసేందుకు సైన్ చేసినట్టు సమాచారం. నితిన్ ఇటీవలే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న మ్యాస్ట్రో సినిమాను కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఆయన దర్శకుడు వక్కంతం వంశీ సినిమాలో నటించనున్నాడు. ఇందులో రష్మిక మందన్న ను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పరాజయం తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న వంశీ తాజాగా నితిన్ కోసం ఓ కథ సిద్ధం చేశాడు. అది నితిన్ కు కూడా నచ్చడంతో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నితిన్- రష్మిక మందన్న కాంబినేషన్ లో ఇదివరకే భీష్మ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో నితిన్, రష్మిక జోడి ఆకట్టుకుంది. దీంతో మరోసారి నితిన్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది రష్మిక.

Also Read

రవితేజ రెమ్యునరేషన్​ పెంచేశాడా?

సూపర్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టిన యువ హీరో..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -