Thursday, April 25, 2024
- Advertisement -

ఫ్యామిలీ మ్యాన్​ -3లో క్రేజీ సౌత్​ హీరో..!

- Advertisement -

అమేజాన్​ ప్రైమ్​లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్​ వెబ్ సీరిస్​ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క హిందీ అనే కాదు అన్ని భాషల్లోనూ ఈ సీరిస్ మంచి పేరు తెచ్చుకుంది. ఫ్యామిలీ మ్యాన్​1 తో పోల్చి చూస్తే .. ఫ్యామిలీ మ్యాన్​ -2 భారీ సక్సెస్​ అయ్యింది. మొదటి భాగానికి రెండో భాగానికి మధ్య రెండేళ్ల గ్యాప్ వచ్చిన ప్రేక్షకులు ఆ సీరిస్ కోసం ఎదురు చూసారు.

ఫ్యామిలీ మ్యాన్ -2 ట్రైలర్ కి యూట్యూబ్ లో 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయంటే ఆ వెబ్ సీరిస్ కోసం జనం ఎంత ఎదురు చూసారో అర్థమవుతుంది. ఫస్ట్ సీరిస్ హిట్ కావడం, రెండో సీజన్ లో హీరోయిన్ సమంత కీలక పాత్రలో నటించడం.. అది కూడా నెగిటివ్​ రోల్​ చేయడంతో ఈ సీరిస్ భారీ సక్సెస్​ అయ్యింది. ఇక సమంత కు సైతం మంచి పేరు తీసుకొచ్చింది.

ఇక ఫ్యామిలీ మ్యాన్​ -3 కి సంబంధించి ఇప్పటికే పలు పుకార్లు వినిపిస్తున్నాయి. మూడో సీజన్ లో కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? అనే కథాంశం ఉండనున్నట్టు టాక్​. ఇందుకు సంబంధించి ఇప్పటికే గత సీరిస్​ లో ఓ హింట్ కూడా ఇచ్చారట. అయితే మూడో సీరిస్​లో తమిళ క్రేజీ హీరో విజయ్​ సేతుపతి ఓ ప్రధాన పాత్ర పోషించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం ఏదీ రాలేదు. కానీ ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. ​ఇప్పటివరకు ఈ విషయంపై సేతుపతిగానీ, ‘ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే కానీ అధికారికంగా ప్రకటించలేదు.

Also Read

ఫ్యామిలీ మ్యాన్​ 3 స్టోరీ ఏంటంటే?

బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడితో తారక్​ మూవీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -