Friday, April 26, 2024
- Advertisement -

ప్లీజ్ డాక్టర్ బాబు.. ఆ సీరియల్ టైమింగ్స్ మార్చండంటూ రిక్వెస్ట్!

- Advertisement -

బుల్లితెరపై శోభన్ బాబుగా పేరు సంపాదించుకున్న నటుడు నిరుపం పరిటాల అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కార్తీక దీపం డాక్టర్ బాబు. జీ తెలుగు లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ డాక్టర్ బాబుగా ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు. బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ సీరియల్ కి ఉన్నంత క్రేజ్ మరే సీరియల్ కి లేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పరిటాల నిరుపమ్ నటిస్తున్నటువంటి మరొక సీరియల్ హిట్లర్ పెళ్ళాం.

ప్రపంచాన్ని వణికించిన హిట్లర్.. మూర్ఖత్వానికి పరాకాష్ట అయితే..ఈ హిట్లర్ మాత్రం మంచికి మారుపేరు. ఈ సీరియల్ లో కొంచెం కోప్పడుతూ, తన మాటే నెగ్గాలనే పంతం ఉండటంచేత అందరు హిట్లర్ అని పిలుస్తుంటారు. ఇలాంటి హిట్లర్ కి పెళ్ళాం అంటే ఎంతో గడసరి అయ్యుండాలి.

ఆగస్టు 17న ప్రారంభమైన ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రసారమవుతుంది. ఈ సీరియల్ లో పరిటాల నిరుపమ్ అభినవ్ జాగర్లమూడి అలియాస్ హిట్లర్‌గా నటించగా.. ఈ హిట్లర్‌కి భార్యగా హీరోయిన్ భానుమతి నటించింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, భాషలలో కూడా ప్రసారం అవుతుంది. కాగా ఈ సీరియల్ సాయంత్రం కాకుండా ప్రైమ్ టైం లో ప్రసారం చేయడంతో ప్రతి ఒక్కరూ చూడటానికి వీలుంటుందని ఈ సీరియల్ టైమింగ్ మార్చాలని అభిమానులు కోరడంతో నిరుపమ్ స్పందించారు.

Also read:సోనూ సూద్ ఫౌండేషన్ కు సారా అలీఖాన్ భారీ విరాళం.. ఎంతంటే?

మా అభిమాన సీరియల్ హిట్లర్ గారి పెళ్ళాం సాయంత్రం 6 గంటల సమయంలో కాకుండా రాత్రికి ప్రసారమయ్యే అలా చూడాలని హిట్లర్ పెళ్ళాం అభిమానులు నిరుపమ్‌ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన పరిటాల తప్పకుండా ఈ విషయం గురించి జీ తెలుగుఅఫీషియల్ తో చర్చిస్తామని మీరు కోరుకున్న విధంగానే సీరియల్ రాత్రి టైం లో ప్రసారమయ్యేలా చూస్తామని తెలిపారు.

Also read:ఆ లేడీ డైరెక్టర్ తో ప్రభాస్ నెక్స్ట్ చిత్రం.. కథ అదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -