Friday, May 3, 2024
- Advertisement -

ఆ లేడీ డైరెక్టర్ తో ప్రభాస్ నెక్స్ట్ చిత్రం.. కథ అదే!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాహుబలి తర్వాత ప్రపంచస్థాయి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత హీరోగా గుర్తింపు పొందాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధేశ్యామ్”, కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్”, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్”సినిమాలు చేస్తున్నారు.ఇదే కాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు తెలిసిందే. ప్రభాస్ సినీ కెరీర్లో తొలిసారిగా ఓ మహిళ దర్శకురాలితో పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also read:ఈ టాలీవుడ్ హీరోలు అందరూ అలా కష్టపడే పైకి వచ్చారు!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం శిష్యురాలిగా “గురు”,”ఆకాశమే నీ హద్దురా” వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ ను కలిసిన సుధా అతనికి స్టోరీ లైన్ వినిపించినట్లు తెలుస్తోంది. దానికి ప్రభాస్ కూడా పాజిటివ్‌గా స్పందించినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం ప్రభాస్ చేపట్టిన సినిమాలు అన్ని పూర్తి కావాలంటే దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది ఈ లోగా సుధ ప్రభాస్ కోసం స్క్రిప్ట్ తయారు చేసుకోవడానికి వీలు ఉంటుందని సమాచారం కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొట్టమొదటిసారిగా ప్రభాస్ మహిళా డైరెక్టర్ తో పని చేయడానికి ఎంత ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.

Also read:అనుపమ రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -