Tuesday, April 30, 2024
- Advertisement -

ఆ సినిమాను పక్కన పెట్టి.. ఇంకో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన నితిన్!

- Advertisement -

టాలీవుడ్ యువ హీరో నితిన్ కు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. తన మొదటి సినిమా తేజ దర్శకత్వంలో ‘జయం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. జయం సినిమా సక్సెస్ తర్వాత నితిన్‌కు వరుసగా అవకాశాలొచ్చాయి. ఆ తర్వాత వి.వి వినాయక్ తో చేసిన ‘దిల్ ‘ కూడా బంపర్ హిట్టయ్యే సరికి ఎనర్జిటిక్ హీరోగ తెలుగులో
సై, ఇష్క్, గుండెజారిగల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.

Also read:ఆ సినిమా రీమేక్ చేస్తే.. బెల్లంకొండ బ్రదర్స్ పరువు పోతుంది..!

గతేడాది భీష్మ మూవీ తో సక్సెస్ అందుకొన్న నితిన్ ఈ యేడాది చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన చెక్‌ మూవీ తో ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘రంగ్ దే’ మూవీతో మంచి విజయాన్ని నమోదు చేసినప్పటికీ ఆశించినంత కలెక్షన్స్ రావటం లేకపోయింది.

Also read:బన్నీ కథలో ఎన్టీఆర్.. మరోసారి స్టూడెంట్ పాత్రలో!

అయితే ఈ సారి తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన అందాధున్ సినిమా రీమేక్ “మాస్ట్రో”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అని అందరికీ తెలిసిందే. తాజాగా వక్కంతం వంశీతో రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న మూవీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.ఈ మూవీ కోసం పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేయనున్న భారీ క్రేజీ ప్రాజెక్ట్ ను వదులుకున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -