Thursday, May 2, 2024
- Advertisement -

నివేదా థామస్ కి కరోనా పాజిటీవ్!

- Advertisement -

దేశంలో సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ఇక కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఎంతో మంది సెలబ్రెటీలు దీని భారిన పడ్డ విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు కన్నుమూశారు. ఇక టాలీవుడ్ లోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా నివేదా థామస్ కూడా కరోనా బాధితుల జాబితాలో చేరింది.

ఈ విషయాన్ని నివేదా థామస్ స్వయంగా మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించింది. జెంటిల్ మాన్ చిత్రంలో నాని సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం పవన్ కళ్యాన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపిస్తుంది.

తన వైద్య బృందం ఎంతో శ్రద్ధ తీసుకుంటోందని, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నివేద పేర్కొంది. ఈ సమయంలో తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అంటూ పోస్టు చేసింది.

నన్ను ట్రోల్ చేస్తున్నారు.. ఆపండి… నాకు పవన్ తమ్ముడు ఉన్నాడు!

పవన్ కళ్యాన్ తిరుపతి ప్రచారంలో ఉద్రిక్తత!

ఖుష్బూపై కేసు.. కారణం ఏంటో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -