Wednesday, April 17, 2024
- Advertisement -

ఖుష్బూపై కేసు.. కారణం ఏంటో తెలుసా?

- Advertisement -

ప్రస్తుతం తమిళ నాట ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రత్యర్థి పార్టీలపై ఆయా నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక వాగ్ధానాలు కనీ వినీ ఎరుగని రీతిలో చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చే వరాలు ఓ రేంజ్ లో ఉంటాయని మాట ఇస్తున్నారు. ఉద్యోగాలు, చదువు, ఇండ్లు, ఆర్థిక సహాయం.. ఒక్కటేమిటి ఎన్నో చేస్తామని అంటున్నారు. బీజేపీ నేత ఖుష్బూ సుంద‌ర్‌పై ఇవాళ చెన్నైలో కేసు న‌మోదు అయ్యింది.  

శుక్ర‌వారం రోజున ఓ మ‌సీదు ముందు ఆమె ప్ర‌చారం నిర్వ‌హించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి.. ఇది ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించినట్టే అని కోడంబాక‌మ్ పోలీసులు ఆమెపై కేసు బుక్ చేశారు. థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

అధికారుల నుంచి ఎటువంటి అనుమ‌తి తీసుకోకుండా మసీదు వద్ద ఖుష్బు ప్రచారాన్ని నిర్వహించారు. అంతే కాదు మ‌సీదు ముందు క‌ర‌ప‌త్రాల‌ను ఖుష్బూ పంచిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోడంబాకం పోలీసులు కేసు రిజిస్ట‌ర్ చేశారు. ఐపీసీ 143, 188 కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

నానమ్మ తాతల పేరు తో కేటీఆర్ నిర్మాణం.. ఎక్కడంటే..!

వైసీపీ నుంచి మరో నాయకుడు జంప్.. పార్టికి రాజీనామా..!

ఫ్రీ గా ఇళ్లు.. కేటీఆర్ ఏమన్నారు అంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -