తెలుగు వెండితెర దైవం నందమూరి తారక రామారావు జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌తో పేరుతో తీస్తున్న ఈ సినిమాను ఆయన తనయుడు హీరో బాలకృష్ణ స్వయంగా నటిస్తు,నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే సినిమాలోని కొన్ని లుక్స్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ లుక్స్‌తో పాటు, రానా సుమంత్, రకుల్, మొదలగు వారి లుక్స్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్ది సినిమా ప్రమోషన్స్‌ను పెంచుతున్నారు చిత్ర దర్శక-నిర్మాతలు. తాజాగా సినిమా నుంచి మరో లుక్‌ను విడుదల చేశారు.
బసవతారకంగా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలోని విద్యాబాలన్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. బసవతారకం గెటప్ లో ఉన్న విద్యాబాలన్ హార్మోనియం వాయిస్తుండగా ఎన్టీఆర్ పాత్ర పోషిస్తోన్న బాలయ్య ఆసక్తిగా చూస్తున్న ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మొదటి భాగాన్ని జనవరి 9న, రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు.
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి..
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
- పాండ్యాతో డేటింగ్ ప్రచారంపై అమీషా పటేల్ ఏమన్నారంటే..?
- బిగ్‌బాస్ సీజన్-10 ప్రారంభం
- అశ్లీల పరిశ్రమను చట్టబద్ధం చేయాలని ఉక్రెయిన్ యోచన!
