Friday, May 3, 2024
- Advertisement -

బాహుబలి 2 పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్

- Advertisement -
Ntr Comments On Bahubali 2

బాహుబలి ది కంక్లూజ‌న్ మూవీ విడుదల అయినప్పటి నుండి బాహుబ‌లిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ఒకే ఒక్క ప్రశ్నకు ఆన్సర్ కోసం ఇండియన్ సినిమా జనాలందరూ నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ ఒక్క ప్రశ్న జవాబు కోసం ప్రతి సినీ ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు. ఎంతో ప్రేక్షకుల సస్పెన్స్ కు తెరదించుతూ.. బాహుబలి 2 ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. నిన్న రాత్రి నుండే చాలా చోట్ల ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమా చూసి ఇప్పటికే చాలా మంది సెలబ్రేటీలు ట్విట్తర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే బాహుబలి 2 సినిమాపై ఎన్టీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. బాహుబలి 2 మూవీ పై ఎవరి రియాక్షన్ ఎలా ఉన్నప్పటికి ఎన్టీఆర్ ట్వీట్ మాత్రం ప్రత్యేకం. ఈ సినిమాపై ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ… జక్కన్న తీసింది తెలుగు సినిమా మాత్రమే కాదని, భారతీయ సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా అని కొనియాడారు. రాజమౌళి విజన్‌కు తమ అద్భుత నటనతో మద్దతుగా నిలిచినందుకు ఖుదోస్ టూ ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణన్ అని ట్వీట్ చేశాడు. ఈ కలను నిజం చేసిన నిర్మాతలు శోభూ, ప్రసాద్, ఇతర నటులకు, టెక్నీషియన్లకు గొంతెత్తి జై కొట్టాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. చివరగా హాట్సాఫ్ టూ రాజమౌళి అంటూ ముగించారు.

{youtube}HLC5OyADj0Q{/youtube} 

Related

  1. బాహుబలి 2 మూవీ రివ్యూ
  2. బాహుబలి మూవీ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్
  3. బాహుబలి 2 స్టోరీ.. కట్టప్ప సీక్రెట్ ఇదే..
  4. ‘బాహుబలి’ కోసం ప్రభాస్ కి 75 కోట్ల పారితోషకం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -