Sunday, May 19, 2024
- Advertisement -

బాహుబలి 2 మూవీ రివ్యూ

- Advertisement -
Baahubali 2 Review

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు ప్రేక్షకుడి జవాబు దొరికింది. ‘బాహుబలి: ది బిగినింగ్’కు కొనసాగింపుగా రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. జక్కన్న విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

‘పరమేశ్వర ఈ బిడ్డ బతకాలి’ అంటూ శివగామి డైలాగ్‌తో సినిమా మొదలవుతుంది..రాక్షస దహన కాండ కోసం వెళ్తుండగా, శివగామికి ప్రమాదం జరుగుతుంది..ఆ ప్రమాదం నుండి శివగామి ని బాహుబలి కాపాడతాడు..ఆ తర్వాత పట్టాభిషేకం జరిగేలోపు దేశ పర్యటన చేసిన రమ్మని అమరేంద్ర బాహుబలిని శివగామి ఆదేశిస్తుంది..దీంతో రాజమాత మాట మేరకు బాహుబలి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు..ఆలా చిన్న రాజ్యం అయినా కుంతలరాజ్య నికి బాహుబలి ఏమి తెలియని అమాయకుడు గా వెళ్ళతాడు.. యువరాణి దేవసేనను చూసి అమరేంద్ర బాహుబలి ప్రేమలో పడతాడు.ఈ విషయం వేగుల ద్వారా భళ్లాల, బిజ్జలదేవుడులు తెలుసుకుంటారు. ఆ తర్వాత దేవసేన గురించి తెలుసుకున్న భల్లాల..ఆమె అందానికి దాసోహం అవుతాడు..ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలి భావిస్తాడు.. అప్పుడే కథ మలుపు తిరిగే ట్విస్ట్ వస్తుంది..దాని కారణంగా రాజు కావాల్సిన బాహుబలి సేనాధిపతి అవుతాడు..భల్లాల కాస్త రాజు అవుతాడు. దేవసేన ను బాహుబలి పెళ్లి చేసుకొని సేనాధిపతిగా రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తాడు.. దేవసేన ఫై కోపం తో భల్లాల బాహుబలి ని చంపాలనుకుంటాడు.. ఈ క్రమం లో కట్టప్ప బాహుబలి ని చంపాల్సి వస్తుంది..కానీ బాహుబలి ని చంపాలని శివగామినే ఆదేశించడం కథలో అసలైన ట్విస్ట్..ఇంతకీ శివగామి ఎందుకు చంపమని ఆదేశం ఇస్తుంది..? ఆ తర్వాత బాహుబలి కొడుకును ఎందుకు కాపాడాలనుకుంటుంది..? శివుడు (బాహుబలి కుమారుడు) ఎలా భల్లాల ఫై యుద్ధం చేస్తాడు..? ఈ యుద్ధం లో భల్లాలదేవా ఎలా చనిపోతాడు అనేది మీరు తెర ఫై చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

బాహుబలి ఫస్ట్ పార్టులో లేని భావోద్వేగాలు, వినోదం సెకండ్ పార్ట్ లో చూపించే ప్రయత్నం చేశారు రాజమౌళి. సినిమా మొదటి భాగం మొత్తం ప్రభాస్, అనుష్కల ప్రేమకథతో, సుబ్బరాజు కామెడీ తో ఆకట్టుకున్నాడు. దర్శకుడు రాజమౌళి అయితే సినిమా మొత్తం ప్రతి 15 నిముషాలకొక అదిరిపోయే సీన్ చూపించి సీట్ల నుండి కదలకుండా చేశాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీక్వెన్సుల్లో రమ్యకృష్ణ, అనుష్క, ప్రభాస్ ల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా కట్టిపడేస్తుంది. అమరేంద్ర బాహుబలి గా ప్రభాస్ నట విశ్వ రూపం చూపించాడు..బాహుబలి కోసం ప్రభాస్ ఏకంగా నాలుగేళ్ల పాటు సమయం కేటాయించడం అభిమానుల్లో ఎక్కడో కాస్త నిరుత్సహం కనిపించింది..కానీ సెకండ్ పార్ట్ చూసి ప్రభాస్ నిర్ణయం తప్పు కాదని అంత అనుకుంటారు. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ దాంట్లో అద్భుతమైన నటనతో అలరించాడు. క భల్లాలదేవ రానా ఫస్ట్ పార్ట్ లో కన్నా ఇందులో అసలు సిసలైన విలనిజం చూపించి ఆశ్ఛర్య పరిచాడు. క్రూరత్వం, కండబలం కలిగిన బల్లాలదేవుడిగా రానా నటనకు థియేటర్స్ లలో జై జై లు పలుకుతున్నారు. కుంతల రాజ్య యువరాణిగా దేవసేన రోల్ లో అనుష్క గ్లామర్ తో ఆకట్టుకుంది.. శివగామి గా రమ్య కృష్ణ ఫస్ట్ పార్ట్ లో కొద్దిసేపు కనిపించే అదరగొట్టింది..కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం చించేసింది. కథ కి అసలు ట్విటర్ ఈమె ఇస్తుందని ఎవ్వరు ఊహించలేదు. ఇక కట్టప్ప…బాహుబలి 2 సినిమాకు ఇంత అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం కట్టప్ప (సత్య రాజ్ ) అని చెప్పాలి.. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్న ఇప్పటికి జనాల్లో నానుతుంది..ఈ ప్రశ్న కు జవాబు కోసమే చాల మంది సినిమాని చూడడానికి ఆసక్తి పెంచుకున్నారు..ఇక బాహుబలి ని చంపే క్రమం లో కట్టప్ప చూపించే సెంటిమెంట్ కు కన్నీరు పెట్టుకోవాల్సిందే..అంతలా బాహుబలి – కట్టప్ప మధ్య సన్నివేశాలు ఉంటాయి..సినిమా కు ప్రధాన బలం గా కట్టప్ప రోల్ నిలిచింది. రాజమౌళి విజన్, డైరెక్షన్, అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విభాగం చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో పెద్ద పొరపాట్లేమీ లేవు.. కాకపోతే పెట్టుకున్న అంచనాలు మరి ఎక్కువ అయ్యాయి. ప్రధానంగా క్లైమాక్స్ వార్ ఎపిసోడ్. ఇందులో రానా, ప్రభాస్ ల మధ్య జరిగే పోరాటం భారీ స్థాయిలో గొప్పగానే ఉన్నా కూడా మిగిలిన సైన్యం చేసే యుద్ధం మొదటి భాగంలో క్లైమాక్స్ లో వచ్చే యుద్దమంత భీభత్సంగా అయితే లేదు. అలానే కొన్ని చోట్ల వార్ సీన్స్ కాస్త బోర్ కొట్టిస్తాయి. అలాగే సినిమా చివర్లో అనుష్క పాత్రకు ఇంకాస్త ఎమోషనల్ టచ్, తమన్నా పాత్రకు కనీసం డైలాగ్స్ చెప్పే ఛాన్స్ అయినా ఇచ్చి ఉంటే ఇంకాస్త ఎక్కువ సంతృప్తికరంగా ఉండేది.

మొత్తంగా :

అద్భుతమైన కథ, అబ్బురపరిచే నటినటులు, అద్భుతంగా తీసే దర్శకుడు.. ఇవన్ని ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. కొన్ని వార్ సీన్స్ కాస్త బోర్ కొట్టించడం.. తమన్నా పాత్ర పెద్దగా లేకపోవడం, క్లైమాక్స్ వార్ ఎపిసోడ్ ఈ సినిమాలో మైనస్ గా కనిపిస్తున్నాయి. తెలుగు సినిమా అంటే మూసకథలు…ఐటెం సాంగ్స్ ..హీరోస్ విలన్లను కొట్టడం..అని అంత అనుకుంటుంటారు. కానీ తెలుగు సినిమా అంటే ఓ అద్భుతం…కలెక్షన్ల సునామీని సృష్టించగల కథలు..హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా సినిమా తీయగల వారు ఉన్నారని బాహుబలి 2 తో మరోసారి నిరూపితం అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజమౌళి సృష్టించిన ఈ అద్భుత దృశ్య కావ్యం అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరచడమేకాక తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి ఖ్యాతిని తెస్తుందని చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -