Saturday, May 4, 2024
- Advertisement -

బేయిల్ పిటీష‌న్‌పై కొన‌సాగుతున్న ఉత్కంఠ‌

- Advertisement -
YS Jagan’s Assets case hearing adjourned to June 9th

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్ర‌మాస్తుల కేసును జూన్ 9 కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. బెయిలు రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టు వేసిన పిటీషన్‌పై నేడు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణుల్లో, ఇటు జగన్ కుటుంబంలోనూ ఆందోళన నెలకొని ఉంది.

ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న సీబీఐ కోర్టు అక్ర‌మాస్తుల కేసును బేయిల్ ర‌ద్దును కోర్టు జూన్ 9 కివాయిదా వేసింది.
దేశంలోనూ, ఏపీలోనూ ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న మోడీ ఆలోచనకు చంద్రబాబు కూడా మద్దతు పలుకుతున్నారు.దాదాపు పాతిక మంది వరకూ ఎమ్మెల్యేలను టీడీపీ తన వైపుకు లాక్కొన్నా.. వైసీపీ తట్టుకుని నిలబడింది. ఐతే.. ఇప్పటివరకూ కేవలం శాంపిల్ మాత్రమే జరిగిందని.. ఇకపై అసలు సినిమా చూపిస్తామని కొందరు టీడీపీ నేతలు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో తనకు ఉన్న పలుకుబడి ఉపయోగించి వచ్చే ఎన్నికల నాటికి జగన్ ను జైలులో ఉంచాలని చంద్రబాబు భావిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో జగన్ కు గతంలో ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటీషన్ వేయడం కలకల రేపుతోంది.ఇందుకసాక్షిమీడియాలో వచ్చిన కొన్ని కథనాలను, ప్రసారాలను ప్రస్తావిస్తోంది. ఐతే.. జగన్ బెయిల్ రద్దయి జైలుకు వెళ్తే్ అది తమకు ఎంతవరకూ లాభిస్తుంది అనే అంశంపై టీడీపీ మధనపడుతున్నట్టు తెలుస్తోంది. జగన్ బెయిల్ పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చే సమయం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తి కనిపిస్తోంది. బెయిల్ షరతులు ఉల్లంఘించినందు వల్ల జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వాదిస్తోంది. జగన్ ఉద్దేశపూర్వకంగా సాక్షులను, కోర్టులో విచారణను ప్రభావితం చేస్తున్నారని వాదిస్తోంది. ఇందుకు సాక్ష్యంగా సాక్షిలో ప్రసారమైన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూను చూపిస్తోంది.
ఇది ఇలా ఉండగా, జగన్ పై కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కాగా, జగన్ బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో జగన్ కుటుంబసభ్యుల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళన నెలకొనివుంది. మ‌రి జ‌గ‌న్ బేయిల్ పిటీష‌న్‌పై ఎలాంటి తీర్పు ఇస్తాదో న‌ని అందిర‌లోను ఉత్కంఠ నెల‌కొంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. జ‌గ‌న్‌పై సీబీఐ కేసుల‌న్నీ డొల్లే అని టీడీపీ లో చర్చ.
  2. వైఎస్ జగన్ కు ఇవి లేనిదే ముద్ద దిగదు..
  3. కాన్ఫిడెన్సా …. ఓవ‌ర్ కాన్ఫిడెన్సా
  4. అందరి చూపు జగన్ వైపే….!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -