యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్స్ తో దూసుకెళుతున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో రెండు భారీ హిట్స్ అందుకొని భారీగా మార్కెట్ పెంచుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతాగ్యారేజ్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత వక్కంతం వంశీతో కలిసి మరో సినిమా చేస్తాడు. ఎన్టీఅర్ దృష్టిలో ఉంచుకొని.. ఓ టాప్ డైరెక్టర్ సినిమా కథ రెడీ చేసుకున్నాడట.
ఆ కథ విన్న యంగ్ టైగర్ చాలా ఎక్సైట్ అయ్యాడట. ఫుల్ స్టోరీ విని ఎన్టీఆర్ షాక్ అయ్యాడట. యంగ్ టైగర్ ను అంతగా ఇంప్రెస్ చేసిన దర్శకుడు ఎవరా అని అనుకుంటున్నారా..? నందమూరి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి, యంగ్ టైగర్ గా తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు అదిరిపోయే స్టోరీ చెప్పింది ఎవరో కాదు… స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఇటివలే ఎన్టీఆర్ కు పూరి టెంపర్ రూపంలో అదిరిపోయే హిట్ ఇచ్చాడు. అయితే ఇటివలే పూరి ఎన్టీఆర్ కు అదిరిపోయే స్టోరీ చెప్పాడట.
ఈ స్టోరీకి ఎన్టీఆర్ బాగా కనెక్ట్ అయ్యాడట. తాను ఆ సినిమా చెయ్యడానికి సిద్దంగా ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించాడట. అయితే ప్రస్తుతం పూరి ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. . తర్వాత మహేష్ తో ఓ సినిమా ఉంది. అలా ఇద్దరూ కూడా బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఈ సినిమా కుదరదు అనిపిస్తోంది.
Related