Friday, May 3, 2024
- Advertisement -

మరోసారి ఎన్టీఆర్ సిక్స్ పాక్.. షార్ట్ తీస్తే బొమ్మ హిట్టే ?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ” ఆర్ ఆర్ ఆర్ ” తరువాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాధించుకున్న సంగతి తెలిసిందే. దాంతో తన తదుపరి సినిమాకోసం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం వెయిటింగ్ నడుస్తోంది. ఎన్టీఆర్ తన తరువాత సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యి దాదాపుగా ఏడాది పూర్తి అయినప్పటికి ఇంతవరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ? లేదా ? అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. ఒకానొక టైమ్ లో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ కూడా షికారు చేశాయి. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

అన్నీ కుదిరితే డిసెంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఇటీవల జపాన్ లో ” ఆర్ ఆర్ ఆర్ ” ప్రమోషన్స్ లో బిజీగా గడిపిన తారక్ తాజాగా ఇండియా చేరుకున్నారు. దాంతో ఇక కొరటాల ప్రాజెక్ట్ పై తారక్ పూర్తి ఫోకస్ చేయనున్నాడట. ఇక కొరటాల మూవీ కోసం మరోసారి తారక్ సిక్స్ పాక్ ట్రై చేయనున్నట్లు సమాచారం. తారక్ సిక్స్ పాక్ తో కనిపించిన ” టెంపర్, అరవింద సామెత.. ” సూపర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

దాంతో కొరటాల ప్రాజెక్ట్ లో మరోసారి సిక్స్ పాక్ చేస్తే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అని ఆయన అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక టెంపర్ మొదలు కొని ” ఆర్ ఆర్ ఆర్ ” వరకు విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న తారక్..కొరటాల మూవీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. కాగా కొరటాల శివ గత చిత్రం ” ఆచార్య ” డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. దాంతో తారక్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టి తిరిగి తన సత్తా చాటలని కొరటాల బావిస్తున్నాడు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మహేశ్ పవన్ మద్య బిగ్ ఫైట్ ?

రాంచరణ్.. వాట్ నెక్స్ట్ ?

యష్ ను ఇబ్బంది పెడుతున్న కే‌జి‌ఎఫ్ సిరీస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -