Friday, May 3, 2024
- Advertisement -

మహేశ్ పవన్ మద్య బిగ్ ఫైట్..బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం ?

- Advertisement -

టాలీవుడ్ లో ఆ ఇద్దరు హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలోనూ, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడంలోనూ ఆ ఇద్దరు హీరోల రూటే సపరేటు. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ నెంబర్ ఒన్ చైర్ కోసం పోటీపడుతున్న హీరోలలో వీరిద్దరే ముందు వరుసలో ఉంటారు. ఆ హీరోలు ఎవరో కాదు… సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ హీరోల సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయం.

ఇక ఈ ఇద్దరు హీరోల మద్య ఎప్పుడు కూడా ఒక రసవత్తరమైన పోటీ నడుస్తూనే ఉంటుంది. ఈ ఇద్దరి హీరోల అభిమానులు ట్విట్టర్ వేదికగా ఎప్పుడు రచ్చ చేస్తూనే ఉంటారు. అలాంటిది ఒకేసారి ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద దండెత్తితే పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ ఉహే పూనకాలు తెప్పిస్తోంది కాదు.. ! ప్రస్తుతం ఇదే వార్తా ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతోంది. మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నా ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రెల్ 28న రిలీజ్ కానుంది.

అయితే ఇదే రోజున పవన్ కల్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరి హర వీరమల్లు కూడా రిలీజ్ కానుందట. గత కొన్నాళ్లుగా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో ఈ మూవీ రిలీజ్ విషయంలో వాయిదా పడుతూనే ఉంది. దాంతో ఈ మూవీ షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ఏప్రెల్ 28 రిలీజ్ చేసేందుకు నిర్మాత ఏ ఏం రత్నం ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికి.. ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజం అయితే గతంలో ఎన్నడూ జరగని బాక్స్ ఆఫీస్ వార్ కు ఈ సమ్మర్ వేదిక కావడం ఖాయం.

ఇవి కూడా చదవండి

సంక్రాంతి రేస్ నుంచి ” ఆది పురుష్ ” ఔట్ ?

ప్రభాస్ తో కామిడీ మూవీ.. వర్కౌట్ అవుతుందా ?

రాంచరణ్ మూవీని.. విజయ్ తో తీస్తున్నాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -