రాంచరణ్ కు నెక్స్ట్ సినిమా కష్టాలు !

What is Ram Charan's Next Movie ?
What is Ram Charan's Next Movie ?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ” ఆర్ ఆర్ ఆర్ ” మూవీతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా సంగతి తెలిసిందే. దాంతో చరణ్ తరువాతి సినిమాలపై అటూ బాలీవుడ్ లోనూ మంచి క్యూరియాసిటీ నెలకొంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ” #RC15 ” చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంచితే ఈ మూవీ తరువాత చరణ్ సినిమా ఏంటి అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు..

నిన్న మొన్నటి దాకా చరణ్ తరువాతి సినిమా యువీ క్రియెషన్స్ నిర్మాణంలో జర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడనే వార్తలు వినిపించాయి. ఈ ప్రాజెక్ట్ ను యువీ క్రియెషన్స్ అధికారికంగా ప్రకటించింది కూడా. అయితే ఏమైందో తెలియదు గాని ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు ఫిల్స్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. దాంతో చరణ్ తరువాతి సినిమా దర్శకుడు ఎవరనేది ఆయన అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. చరణ్ కోసం ఓ ఇద్దరు దర్శకులు లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహేశ్ బాబు తో ” సర్కారువారిపాట ” మూవీతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాదర్శకుడు పరశురామ్.. రామ్ చరణ్ కోసం ఒక అదిరిపోయే స్క్రిప్ట్ సిద్దం చేశాడట.

కథ లైన్ కూడా ఇప్పటికే చరణ్ కు వినిపించినట్లు సమాచారం. ఇక కన్నడ దర్శకుడు నార్థన్ కూడా రామ్ చరణ్ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేసి కథ వినిపించాడట. అయితే ఈ ఇద్దరి దర్శకులకు కూడా చరణ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో చరణ్ తన తరువాతి మూవీని ఎవరితో ప్లాన్ చేస్తాడు ? కథ ఎలా ఉండబోతుంది ? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆయన అభిమానుల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి చరణ్ ను ఇంప్రెస్ చేసే దర్శకుడు ఎవరో చూడాలి.

ఇవి కూడా చదవండి

మహేశ్ పవన్ మద్య బిగ్ ఫైట్ ?

మహేశ్ టార్గెట్ 2025 .. రాజమౌళి ఫిక్స్ అయ్యరా ?

సంక్రాంతి రేస్ నుంచి ” ఆది పురుష్ ” ఔట్ ?