Sunday, May 12, 2024
- Advertisement -

‘పడి పడి లేచె మనసు’ రివ్యూ

- Advertisement -

యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన తాజా చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హ‌ను రాఘ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి ప‌ల్ల‌వి న‌టిస్తుంది. లై లాంటి ప్లాప్ సినిమా త‌రువాత హ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై అంద‌రికి ఆస‌క్తి నెల‌కొంది. క్యూట్ ల‌వ్ స్టోరీ , పైగా శ‌ర్వా, సాయి ప‌ల్ల‌వి న‌టిస్తుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు విప‌రీతంగా ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్ మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ రోజే విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

కథ:
సినిమా కథ నేపాల్‌లోనే మొద‌ల‌వుతుంది. తను ప్రేమించిన అమ్మాయికి దూరమైన సూర్య(హీరో) తన ప్రేమకథను చెప్పటం ప్రారంభిస్తాడు. కొల్‌కతాలో వైశాలి (హీరోయిన్‌) అనే మెడికల్ స్టూడెంట్తో ప్రేమలో పడ్డ సూర్య, ఆమె వెంటపడుతుంటాడు. వైశాలి కూడా సూర్యని ఇష్టపడుతుంది. కానీ తన గతం కారణంగా కలిసుందాం గాని పెళ్లి వద్దని సూర్య అంటాడు. దీంతో ఇద్దరు విడిపోతారు సూర్య, వైశాలీలు తిరిగి ఎలా కలిశారు. ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన ఇబ్బందులు ఏంటీ అన్నదే మిగతా కథ.

న‌టీ,న‌టుల ఫ‌ర్మామెన్స్ :
మరోసారి తనదైన మెచ‍్యూర్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు శర్వానంద్. రొమాంటిక్‌, లవ్ సీన్స్‌తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి కూడా తన మీద ఉన్న అంచనాలకు తగ్గ స్థాయిలో న‌టించింది. శర్వా, సాయి పల్లవిల నటన సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఇద్దరు నేచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. సినిమా అంతా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరగటంతో ఇతర పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఉన్నంతలో ప్రియదర్శి, సునీల్‌, వెన్నెల కిశోర్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు.

విశ్లేష‌ణ‌:
హను రాఘవపూడి మరోసారి తన మార్క్‌ ప్రేమకథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథా కథనాలు కాస్త స్లోగా ఉన్న‌ప్ప‌టికి …విజువల్స్‌, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కామెడీ, సాంగ్స్‌తో తొలి భాగాన్ని ఇంట్రస్టింగ్‌గా మార్చేశాయి. కానీ ఇంటర్వెల్‌ సీన్‌ విషయంలో కాస్త తడబడ్డట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల విడిపోవడానికి కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు. ద్వితీయార్థంలో మాత్రం దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. సినిమా రొటీన్ సీన్స్‌తో సాగటంతో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. అక్కడక్కడా సునీల్‌ కామెడీ వర్క్‌ అవుట్‌ అయినా ఫస్ట్ హాఫ్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.క్లైమాక్స్‌ సన్నివేశాలు కూడా హడావిడిగా ముగించేసినట్టుగా అనిపిస్తుంది. విశాల్ చంద్రశేఖర్‌ తన సంగీతంతో మ్యాజిక్‌ చేశాడనే చెప్పాలి. సినిమాటోగ్రఫి, ఆర్ట్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉన్నాయి.

బోట‌మ్ లైన్ : మ‌రో హిట్ త‌మ ఖాతాలో వేసుకున్న శ‌ర్వా, సాయి ప‌ల్ల‌వి







Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -