Sunday, May 19, 2024
- Advertisement -

ఏపీ టెక్కీ అనుహ్య హత్య కేసులో సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన ముంబ‌య్ హైకోర్టు..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నానికి చెందిన అనూహ్యపై రేప్ చేసి హత్య చేసిన కేసుపై ముంబ‌యి హైకోర్టు సంచ‌త‌న తీర్ప‌ను వెలువ‌రించింది. ఈ కేసులో దోషి చంద్రభాను సనప్‌కు ఉరిశిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నానికి చెందిన అనుహ్య 2014 జనవరి ఐదో తేదీన హత్యకు గురైంది. జనవరి 16 వతేదీన ఆమె మృతదేహం దొరికింది.

మచిలీపట్నానికి చెందిన అనూహ్య.. ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆమె తిరిగి ముంబై వెళ్లింది. రాత్రి సమయంలో లోకమాన్య తిలక్ రైల్వేస్టేషన్‌లో దిగింది. అక్కడి నుంచి ఆమెకు లిఫ్ట్ ఇస్తానంటూ కారు డ్రైవర్ చంద్రభాను సనప్ ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత కొంతదూరం తీసుకెళ్లి ఆమెను అత్యాచారం చేసి చంపేశాడు.

అయితే, లోకమాన్య తిలక్ రైల్వేస్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ సమయంలో కారు డ్రైవర్ చంద్రభాను ముందు నడుస్తుంటే వెనుక అనూహ్య బ్యాగ్‌తో సహా వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దాని ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై 2015 డిసెంబర్ లో సెషన్స్ కోర్టు జీవిత మరణశిక్ష విధించింది.

సెషన్స్ కోర్టు తీర్పుపై చంద్రభాను హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. అనుహ్యపై రేప్ చేసి హత్య చేసిన చంద్రభానుకు మరణశిక్షను విధించింది.ఈ తీర్పుపై అనుహ్య తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -