పవన్ ఫ్యాన్స్ ‘కాటమరాయుడు’ విజయంను ఎంజాయ్ చేస్తూ ధియేటర్ల వద్ద సందడి చేస్తూ ఉంటే.. పవన్ మాత్రం ఈ ఆనందాలకు అతీతంగా నిన్న ‘కాటమరాయుడు’ గురించి ఎటువంటి టెన్షన్ లేకుండా తన కూతురు పుట్టినరోజును ఆద్యతో కలిసి నిన్న పూణేలో జరుపుకున్నాడు.
ఈ పుట్టినరోజు కు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను రేణుదేశాయ్ ట్విటర్ లో షేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ తో ‘కాటమరాయుడు’ సక్సస్ జోష్ ను పంచుకుంది. పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్యలు పూణేలో రేణుదేశాయ్ దగ్గర ఉంటారు. పవన్ పూణే వెళ్లి తన పిల్లల యోగ క్షేమాలు తెలుసుకుంటు ఉంటాడు. పవన్ కు తెలుగు భాష పట్ల ఉన్న మక్కువతో తన పిల్లలకు కూడ దూరంగా ఉన్నా తెలుగును నేర్పించడానికి ఎంతో శ్రమ పడుతున్నాడు పవన్.
ఒకవైపు ‘కాటమరాయుడు’ సక్సస్ సంబరాలకు దూరంగా తన కూతురుతో అతి నిరాడంబరంగా జరుపుకుంటున్న ఆద్య పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఈ ఫోటోను చూస్తే పవన్ నిరాడంబర జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్ధం అవుతుంది. సో ఏది ఏమైనా.. పవన్ సినిమాల నుండి రాజకీయాల వరకు ఆ పై తన వ్యక్తిగత జీవితం వరకు ఒక విభిన్నమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్న.. పవన్ కు సంబంధించిన ఏ ఫోటోలు వచ్చినా అవి హాట్ టాపిక్ గా మారుతాయి. కాబట్టి ఆద్యా.. పుట్టినరోజు ఫోటో కూడ ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ సెటర్.
{youtube}tO15S4JGE8E{/youtube}
Related